For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మీరాయ్‌కు చేదు అనుభవం.. జూలీ2ని కాపాడలేకపోయిన నగ్మా.. కలెక్షన్లు చూస్తే షాకే..

  By Rajababu
  |
  తుస్సుమన్న జూలీ 2 కలెక్షన్లు చూస్తే షాకే

  దక్షిణాదిలో అగ్రతారగా పేరు తెచ్చుకొన్న లక్ష్మీరాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. జూలీ2 చిత్రంలో తన అందానికి మెరుగుపెట్టుకొని హాట్‌హాట్‌గా నటించింది. అనేక వివాదాలు, సంచలన వార్తల మధ్య నలిగిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజైంది. విడుదలకు ముందు వచ్చిన మంచి స్పందన భిన్నంగా ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తాపడింది. బాలీవుడ్‌లో పాగా వేయాలనుకొన్న రాయ్ లక్ష్మీ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది. ప్రస్తుతం ఈ చిత్రం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

  నగ్మా జీవిత కథ

  నగ్మా జీవిత కథ

  రాయ్ లక్ష్మీ నటించిన జూలీ2 చిత్రం 80వ దశకంలో ఓ సినీతార జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు తెరక్కించామని చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ చెప్పారు. ఆ సినీతార ఎవరు అనే ఆరా తీస్తే అన్ని వేళ్లు నగ్మా వైపు చూపించాయి. నగ్మా జీవిత కథ అనగానే జూలీ2పై అంచనాలు పెరిగాయి. ప్రచారపరంగా ఈ సినిమా మరోస్థాయికి వెళ్లింది.

   సినిమాపై నగ్మా స్పందన

  సినిమాపై నగ్మా స్పందన

  జూలీ2 తన జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా అని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో నగ్మా కూడా స్పందించింది. సినిమా విడుదలైతే గానీ తానేమీ మాట్లాడలేను. సినిమా చూసిన తర్వాత స్పందిస్తాను అని చాలా సింపుల్‌గా నగ్మా సమాధానం ఇచ్చింది.

  తుస్సుమన్న జూలీ2

  తుస్సుమన్న జూలీ2

  ఇలాంటి వార్తల నేపథ్యంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూలీ2 చిత్రం తొలి ఆట నుంచే తుస్సుమన్నది. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీ చాలా దారుణంగా కనిపించింది. తీరా సినిమా చూస్తే మర్డర్ మిస్టరీ అని తేలిపోయింది. ఏ సినీ తారకు సంబంధం లేని కథను తెరకెక్కించారనే మాటలు వినిపించాయి.

   కథాపరంగా జూలీ2లో

  కథాపరంగా జూలీ2లో

  ఇక జూలీ2 చిత్రంలో కథాపరంగా దక్షిణాది సినీ పరిశ్రమను స్టోరీలోకి లాక్కొచ్చారు. ఏదో ఒకటి అరా సీన్లతో వివాదం రేకెత్తించే ప్రయత్నం చేశారు. దక్షిణాది సినిమా పరిశ్రమలో రవి కుమార్ అనే హీరో క్యారెక్టర్‌ను కథలో వాడుకొన్నారు. ఆ క్యారెక్టర్ శరత్ కుమార్ అని వార్తలు వచ్చినప్పటికీ అలాంటి పరిస్థితి తెర మీద ఎస్టాబ్లిష్ కాలేదు. దాంతో సినిమాలో అసలు సరుకే లేదని స్పష్టమైంది.

   హీరోయిన్ల రొటీన్ కథ

  హీరోయిన్ల రొటీన్ కథ

  జూలీ2 కథలో భాగంగా హీరోయిన్ నిర్మాతల పడక మీదకు చేరాల్సి వస్తుంది. ఇది అన్ని సినిమా పరిశ్రమలో అందరు హీరోయిన్లకు ఎదురయ్యే జరిగే తతంగమని ఇటీవల కొందరు తారలు ఇస్తున్న స్టేట్‌మెంట్లతో స్పష్టమైంది. ఇది నగ్మాకు ఒక్కరికే ఆపాదించడం తప్పని రుజువైంది. సినీతారల బయోపిక్‌లో ఉండే మసాలా జూలీ2లో కరువైంది. అందుకే సినిమా ప్రజాదరణకు నోచుకోలేకపోయింది.

   30 కోట్ల బడ్జెట్‌తో

  30 కోట్ల బడ్జెట్‌తో

  నేహా దుపియాతో జూలీ చిత్రాన్ని తెరకెక్కించిన దీపక్ శివదసానీ జూలీ2కి దర్శకుడు. జూలీ చిత్రానికి ప్రీక్వెల్ అని ముందే ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో అంటే దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించారు.

   వారాంతంలో చాలా దారుణం

  వారాంతంలో చాలా దారుణం

  జూలీ2 రిలీజ్ తర్వాత కలెక్షన్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతానికి జూలీ2 వసూలు చేసింది కేవలం రూ.1.60 కోట్లు మాత్రమే. అంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కలెక్షన్లు అద్దం పట్టాయి.

   బాక్సాఫీస్‌పై అవగాహన లేదు..

  బాక్సాఫీస్‌పై అవగాహన లేదు..

  సినిమా కలెక్షన్ల పరిస్థితిని రాయ్ లక్ష్మీ దృష్టికి తీసుకురాగా.. బాక్సాఫీస్ నంబర్లపై నాకు అంతగా అవగాహన లేదు. సింగిల్ థియేటర్లలో సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది అని రాయ్ లక్ష్మి తన అభిప్రాయాన్ని చెప్పారు.

   మరో బాలీవుడ్ చిత్రంలో రాయ్ లక్ష్మీ

  మరో బాలీవుడ్ చిత్రంలో రాయ్ లక్ష్మీ

  మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా వివరాలను వెల్లడిస్తాను. జూలీ2 కారణంగా ఎక్కువ సినిమాలు ఒప్పుకోలేదు. త్వరలోనే దక్షిణాది సినిమాలు, హిందీ సినిమాలతో బిజీ అవుతాను అని రాయ్ లక్ష్మీ చెప్పింది.

  English summary
  The much-hyped bold film 'Julie 2' failed to pull the audience to the movie theatres. The film marks the Bollywood debut of popular south actress Raai Laxmi who has been raising the temperatures ever since the release of the film's trailer. Written, co-produced and directed by Deepak Shivdasani, 'Julie 2' is the sequel to the 2004 film 'Julie' which had Neha Dhupia in the title role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X