For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంత‌లా దిగ‌జారిపోతార‌ని అనుకోలేదు, సినిమా చూసి మాట్లాడ‌తాన‌ు : నగ్మా

  |
  మరీ ఇంత‌లా దిగ‌జారిపోతారా ?

  కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మ‌న్‌గా నచ్చని సినిమానల్లా బ్యాన్ అంటూనో, లేదంటే సీన్లకు సీన్లు లేపేస్తూనో ఎన్నో నీతులు వ‌ల్లించి బాలీవుడ్ విలన్‌గా పేరు తెచ్చుకున్న పహ్ల‌జ్ నిహ్లాని ఇప్పుడు రూటు మార్చి జూలీ-2 వంటి ఎరోటిక్ సినిమాను నిర్మించటం ఒక షాక్ అయితే పబ్లిసిటీ కోసం అతను చెప్పిన కథ మరో వింత. ల‌క్ష్మీరాయ్ చాలా బోల్డ్‌గా న‌టించిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మంచి హైప్ సాధించింది. ఈ హైప్ స‌రిపోలేదునుకున్నాడో ఏమో, ప‌బ్లిసిటీ కోసం ప‌హ్లాజ్ ఇటీవ‌ల ఓ బాంబ్ పేల్చాడు.

   బోల్డ్ అవతారంలో

  బోల్డ్ అవతారంలో

  సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది.

   'జూలి'కి సీక్వెల్ గా

  'జూలి'కి సీక్వెల్ గా

  గతంలో నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలి'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న సినిమా విడుదల కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది.

  పహ్లాజ్ నిహ్లాని

  పహ్లాజ్ నిహ్లాని

  ఇప్పుడు ఈ చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని మీడియా ముందుకొచ్చి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ చిత్రం ఓ మాజీ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాడు. ఆమె పేరు బయటపెడితే.. తమకు లీగల్ సమస్యలు తప్పవని.. సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు.

   పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ

  పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ

  అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు. అయితే పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ కలిపి చూసినవాళ్ళంతా ఆ కథ ఒకప్పటి సౌథ్ గ్లామర్ హీరోయిఒన్ నగ్మా అనే అనుకున్నారు. అసలు అలా అనుకోవాలన్నదే పహ్లజ్ ఉద్దేశ్యమేమో అన్నది కూడా ఒక టాక్ .

   ఎఫైర్ పెట్టుకుంది

  ఎఫైర్ పెట్టుకుంది

  "1990-2000 మధ్య కాలంలో సౌత్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ కెరీర్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సౌత్ లో పెళ్లయిన ఓ సూపర్ స్టార్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఆ వివరాలతో పాటు సౌత్ నుంచి ఆమెను ఎలా బయటకు పంపించారు. తర్వాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది లాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి." జూలీ-2 సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెబుతున్న మాటిది.

  నగ్మా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు

  నగ్మా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు

  ఆయన నగ్మా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆ కథ నగ్మాదే అంటూ ఒక టాక్ బయల్దేరింది. ఈ సినిమా ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఓ తారామ‌ణి క‌థ అని ప్ర‌క‌టించాడు. అయితే ఆమె పేరు వెల్ల‌డించ‌లేదు. అయినా ప‌హ్లాజ్ ప‌రోక్షంగా మాట్లాడింది న‌గ్మా గురించే అని క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

   ఇంత‌లా దిగ‌జారిపోతార‌ని అనుకోలేదు

  ఇంత‌లా దిగ‌జారిపోతార‌ని అనుకోలేదు

  దీంతో ఈ వివాదంపై న‌గ్మా మాట్లాడింది. "ఇప్పుడు ఏమి చేయాలో తెలియ‌డం లేదు. ఇంత‌లా దిగ‌జారిపోతార‌ని అనుకోలేదు. ప‌బ్లిసిటీ కోసం చెబుతున్నారో, సినిమాలో ఉందో చూడాలి. సినిమా విడుద‌ల‌య్యాక చూసి మాట్లాడ‌తాన‌ు" అని న‌గ్మా చెప్పింది. మొత్తానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

  English summary
  “I would love to make a comeback and I have been getting several offers. But I feel the roles are not substantial and worthy of staging a comeback. Also, since I am busy in politics, I need to figure out my time too,” says Nagma
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X