July OTT Releases: సూపర్‌స్టార్ల చూపు OTT వైపు.. జూలైలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఇవే!

దేశంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన పరిస్థితుల ప్రభావంతో దేశ సినిమా పరిశ్రమలో కొత్త ఉత్తేజం రేకెత్తింది. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుడి ఇంటిలోకి సినిమా అడుగుపెట్టింది. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు భారీగా ప్రేక్షకుల జీవితాల్లోకి ప్రవేశించాయి. ఓటీటీ పరిశ్రమ సినీ లోకానికి కొత్త సూపర్‌స్టార్లను పరిచయం చేసింది. తాజాగా జూలైలో ఓటీటీలో రాబోతున్న కొన్ని చిత్రాలు వివరాలు మీకోసం..

లాక్‌డౌన్ సమయంలో

లాక్‌డౌన్ సమయంలో

లాక్‌డౌన్ సమయంలో ఫ్యామిలీ మ్యాన్ ద్వారా మనోజ్ బాజ్‌పేయ్, మీర్జాపూర్ ద్వారా పంకజ్ త్రిపాఠి, ఆయుష్మాన్ ఖురానా లాంటి వాళ్లు సత్తా చాటారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఓటీటలనే నమ్ముకొన్నట్టు స్పష్టమైంది. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి అగ్ర నటులు కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు. బుల్లితెరపైన తమిళ, తెలుగు రంగాల్లో కథా సంపుటిలు వెలుగు చూశాయి.

సినిమాలే కాకుండా రియాలిటీ షోలు

సినిమాలే కాకుండా రియాలిటీ షోలు

కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రియాలిటీ షోలు, సీరియల్స్ లాంటివి కూడా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ముందు ఓటీటీలు థియేటర్లపై ఆధిపత్యం చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఓటీటీల ప్రేక్షకులపై బలంగా ప్రభావం చూపుతాయి. ఓటీటీలే ప్రధాన ప్రసార మాధ్యమాలుగా ఉంటాయి అని అభిప్రాయపడుతున్నారు.

లోకల్ ఓటీటీల హవా

లోకల్ ఓటీటీల హవా


ప్రాంతీయ భాషా చలన చిత్ర రంగంలో లోకల్ ఓటీటీ యాప్స్ ప్రేక్షకులకు చేరువయ్యాయి. తెలుగులో ఆహా, గుజరాతీలో ఓహో గుజరాతీ, బెంగాలీలో హైచోయ్ లాంటి ఓటీటీలకు మంచి ఆదరణ దక్కింది. ఇలాంటి లోకల్ యాప్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, జీ5, డిస్నీ+హాట్ స్టార్ లాంటి మల్టీ నేషనల్ ఓటీటీ సంస్థలకు సవాల్ విసిరే మాదిరిగా ప్రేక్షకులను మెప్పించాయి.

Recommended Video

IPL 2018: Mahesh Tweets To Rashid Khan
జూలైలో రిలీజ్ అయ్యే చిత్రాలు

జూలైలో రిలీజ్ అయ్యే చిత్రాలు


జూలై మాసంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు పంట పండే అవకాశం కనిపిస్తున్నది. జూలై 15వ తేదీన మాలిక్, జూలై 16వ తేదీన తూఫాన్, జూలై 20వ తేదీన నారప్ప, జూలై 21వ తేదీన ఇక్కత్, హాస్టల్ డేజ్, జూలై 22న సర్పట్టా పరంబరై చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. జూలై 23వ తేదీన ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన హంగామా 2 డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X