»   » బిగ్‌బాస్‌లోకి ఆ ముగ్గురు వెళ్తే భూకంపమేనట.. ఎన్టీఆర్ చెప్పిన ఆ ముగ్గురు ఎవరంటే...

బిగ్‌బాస్‌లోకి ఆ ముగ్గురు వెళ్తే భూకంపమేనట.. ఎన్టీఆర్ చెప్పిన ఆ ముగ్గురు ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రంలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జైలవకుశ ఈ నెల 21వ తేదీన విడుదలవుతుంది. అయితే ఓ వేళ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రలు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది. ఊహించండి. ఇదే ప్రశ్న ఎన్టీఆర్ ను అడిగితే ... ఆయన ఇచ్చే సమాధానం... ఆయన మాటల్లోనే....

రచ్చ రచ్చ చేస్తాడు...

రచ్చ రచ్చ చేస్తాడు...

కుశుడు చాలా కన్నింగ్. అతడు నిమిషమైనా కుదురుగా ఉండడు. అతడు ఆ ఇంట్లోకి అందరిలాగా సాఫ్ట్ గా కాకుండా, గోడ దూకి వెళ్తాడు. ఇక హౌస్ లోకి వెళ్తే మాత్రం సామిరంగా... రచ్చరచ్చ చేసేస్తాడు. ఎప్పుడు హడావిడి చేస్తూనే ఉంటాడు. అంటే అతడి క్యారెక్టర్ హైపర్ యాక్టివీ అన్నమాట.


అతడు చాలా అమాయకుడు...

అతడు చాలా అమాయకుడు...

ఇక లవ్ కుమార్ గురించి చెప్పాలంటే... అతడు చాలా అమాయకుడు. ఎంతగా అంటే ఎవరైనా స్విమింగ్ పూల్ లోకి వెళ్లి పడుకోమని చెప్తే ... మాత్రం ఇంకా ఏమీ ఆలోచించకుండా వాళ్లు చెప్పినట్లుగానే వెళ్లి పడుకుంటాడు. అంత అమాయకుడు.


తన అధీనంలోకి తీసుకుంటాడు...

తన అధీనంలోకి తీసుకుంటాడు...

ఇక జై గురించి చెప్పుకుంటే... అసలు అతడు ఆ ఇంట్లో ఎవ్వరినీ ఉండనివ్వడు. మొత్తం తన అధీనంలోకి తీసుకుంటాడు. ముక్కుపై కోపం, చాలా దూకుడుగా వ్యవహరిస్తాడు అని ఎన్టీఆర్ చెప్పాడు. జై లవ కుశ పాత్రలు ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే జరిగేదిదే అని ఎన్టీఆర్ ఆసక్తికరంగా వెల్లడించారు.


 తనలో సమానంగా ఉన్నాయి...

తనలో సమానంగా ఉన్నాయి...

కాకుంటే ఈ మూడు క్యారెక్టర్లకు... మీ రియల్ లైఫ్ కి కనెక్ట్ అయి ఉందా? వీటికి రేటింగ్ ఇస్తారా అంటే మాత్రం... జైలవకుశ మూడు పాత్రలు తనలో సమానంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చివరి వారంలోకి ప్రవేశించింది. అలాగే జై లవకుశ చిత్రం ఈ వారమే విడుదలకు సిద్ధమవుతున్నది.


English summary
Junior NTRs Lates movie is Jai Lava Kusa. NTR potrayed three roles in this movie. This these roles are talk of the industry now. Before release of JLK, NTR in busy with promotion activities of film. In this occasion NTR revealed that How situation, if Jai, Lava, Kusa character enters into Bigg Boss house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu