»   » బ్రహ్మీ కోసం పవన్, మహేష్, జూ ఎన్టీఆర్ హెల్ప్ (ఫోటోలు)

బ్రహ్మీ కోసం పవన్, మహేష్, జూ ఎన్టీఆర్ హెల్ప్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో బ్రహ్మానందం రేంజి ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కామెడీ లేకుండా ఏ స్టార్ హీరో సినిమా తెరకెక్కలేని పరిస్థితి. ఆయన డేట్స్‌కు తగిన విధంగా స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాలు షెడ్యూల్స్ తయారు చేసుకునే పరిస్థితి. వృత్తి పరంగా అవసరమే కావచ్చు, మరేదైనా కావచొచ్చు... బ్రహ్మానందం పరిశ్రమలోని అందరికీ ఆప్తుడు.

బ్రహ్మానందం తన నట వారసుడు రాజా గౌతంను ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అయితే రాజా గౌతంకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం రాజా గౌతం నటిస్తున్న 'బసంతి' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు హైప్ తేవడానికి తన పలుకుబడి ఉపయోగిస్తున్నారు బ్రహ్మానందం.

ఇండస్ట్రీలో టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లను 'బసంతి' సినిమా ప్రమోషన్ కోసం రంగంలోకి దింపుతున్నారు. ఇటీవల మహేష్ బాబు చేతుల మీదుగా 'బసంతి' మూవీ ట్రైలర్ విడుదల చేయించిన బ్రహ్మానందం, తాజాగా ఈ రోజు జూ ఎన్టీఆర్ చేతుల మీదుగా బసంతి ఫస్ట్ సాంగ్ టీజర్ విడుదల చేసాయించారు.

త్వరలో జరుగబోతున్న బసంతి మూవీ ఆడియో ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు బ్రహ్మానందం. తనకు అత్యంత ఆప్తులు అయితే తప్ప ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కాని పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం స్వయంగా కోరడంతో 'బసంతి' మూవీ ఆడియో వేడుకకు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ స్టార్ హీరోల రంగ ప్రవేశంతోనైనా రాజా గౌతం హీరోగా స్టాండ్ అవుతాడా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.

ఎన్టీఆర్‌తో బసంతి ఫస్ట్ సాంగ్ టీజర్

ఎన్టీఆర్‌తో బసంతి ఫస్ట్ సాంగ్ టీజర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా ‘బసంతి' ఫస్ట్ సాంగ్ టీజర్ విడుదల చేయిస్తున్న దృశ్యం.

ట్రైలర్ రిలీజ్లో మహేష్

ట్రైలర్ రిలీజ్లో మహేష్


ఇటీవల జరిగిన ‘బసంతి' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల ముఖ్య అతిథులుగా హాజయ్యారు.

తారక్‌తో బ్రహ్మానందం చనువు

తారక్‌తో బ్రహ్మానందం చనువు


తారక్, బ్రహ్మానందం మధ్య ఎంత చనువు ఉందో....ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది.

బసంతి

బసంతి


‘బాణం' దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో బ్రహ్మానందం కుమారుడు హీరోగా 'బసంతి' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ టైటిల్ కి A lovestory between a kite and a flight అనే ఇంట్రస్టింగ్ క్యాచీ లైన్ పెట్టారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

రాజా గౌతం

రాజా గౌతం


సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. ‘బసంతి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ సైన్స్‌'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా రాజా గౌతమ్‌ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.

ఇతర పాత్రలు, టెక్నీషియన్స్

ఇతర పాత్రలు, టెక్నీషియన్స్


ని ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి, కెమెరా: అనీల్ భండారి, మాటలు: శ్రీకాంత్ విస్సా, నృత్యాలు: రఘు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య

English summary
Comedian Brahmanandam's son Raja Gautham, who debuted with Pallakilo Pelli Koothuru in 2009, is now making his comeback with Basanti starring Alisha Baig in female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu