»   » పదేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకోసారి సూర్యతో జ్యోతిక

పదేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకోసారి సూర్యతో జ్యోతిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూర్య - జ్యోతిక కలిసి ఒక తమిళం సినిమాలో నటించబోతున్నారట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. తెలుగు .. తమిళం భాషల్లో కథానాయకుడిగా సూర్యకి .. నాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. వివాహమయ్యాక కొంత గ్యాప్ తీసుకుని ఆ మధ్య జ్యోతిక చేసిన '36 వయదినిలే' సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. జ్యోతికకి గల క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించింది.

నిజానికి సూర్యా లేటెస్ట్ సినిమా 24 లో నిత్యామీనన్ నటించిన పాత్రలో సూర్య భార్య జ్యోతిక నటించాల్సి ఉంది. చివరి క్షణంలో జ్యోతిక కాదనడంతో.. ఆ అవకాశం నిత్యాకి దక్కింది. అయితే, తాజా సమాచారం త్వరలోనే సూర్య-జ్యోతిక జంట వెండితెరపై మరోసారి మెరవనున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా సూర్యనే వెల్లడించాడు.

surya-jyothika

జ్యోతిక రీ ఎంట్రీ మూవీ 36 వయోదినిలే మూవీని సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించగా, ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో తన తరువాతి సినిమాని కూడా ప్లాన్ చేసింది జ్యోతిక. అయితే ఈ మూవీని కూడా సూర్యనే నిర్మిస్తున్నాడు.

తొలి చిత్రం "కుట్రం కడిదల్‌"తోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బ్రహ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. 2006లో వచ్చిన "జిల్లెండ్రు ఒరుక్కాదల్" (తెలుగులో నువ్వూ, నేనూ,ప్రేమ) తర్వాత మళ్ళీ ఇద్దరూ తెరని పంచుకోలేదు. ఇప్పుడు వీరిద్దరి అభిమానులకోరిక తీరనుందన్న మాట.

English summary
actor Suriya reveals there's much more the audience can look forward to, including a film with his wife Jyothika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu