»   » రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దహనం, నాగార్జున టెన్షన్!

రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దహనం, నాగార్జున టెన్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. హథీరామ్ భావాజీ జీవితం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలకు సిద్ధమైంది.

ఈ చిత్రం టైటిల్ విషయంలో కొంతకాలంగా ఓ వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టైటిల్ వివాదం తారాస్థాయికి చేరడం, ఆందోళన కారులు దర్శకుడు రాఘవేంద్రరావు దిష్టబొమ్మను తగలబెట్టడం లాంటి చర్యలకు పాల్పడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.


 ఎందుకీ గొడవ?

ఎందుకీ గొడవ?

ఇంతకు ముందు రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు వచ్చాయి. అన్నమయ్య, శ్రీరామదాసు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలు కాబట్టే ఈ సినిమాలకు అవే టైటిల్స్ పెట్టారు. అయితే ఇపుడు హథీరామ్ భావాజీ జీవితంపై తీస్తున్న సినిమాకు ఆయన పేరు కాకుండా... ‘ఓం నమో వెంకటేశాయ' అని పేరు పెట్టడం ఏమిటి, ఇలా చేయడం గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడమే అని ఆందోళనకారులు వాదిస్తున్నారు. దిష్టబొమ్మ దహనం

దిష్టబొమ్మ దహనం


ఇంతకు ముందు తిరుమలలో శ్రీవారి పాదాల వద్ద గిరిజన విద్యార్థి సమాఖ్య నాయకులు ఈ విషయమై ఆందోళన చేసారు. తాజాగా కరీంనగర్లో దర్శకుడి దిష్టి బొమ్మను దహనం చేసారు. ఎవరీ హాథీరామ్ బావాజీ

ఎవరీ హాథీరామ్ బావాజీ


ఉత్తరాదికి చెందిన హథీరాంజీ బావాజీ తిరుమలకు వచ్చి, స్వామిసేవలో తరించారు. అందుకే చాలా యేళ్ళు బావాజీ శిష్య పరంపరలో మహంతుల పాలనలో తితిదే ఉండేది. ఇప్పటికీ తిరుమలలో హథీరాంజీ మఠం ఉంది. ఫిబ్రవరి 10న

ఫిబ్రవరి 10న


అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తి కథా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 10న సినిమా విడుదలకు సిద్ధమైంది.
English summary
Director K. Raghavendra Rao effigy burns at Karimnagar about 'Om Namo Venkatesaya' Movie Title Controversy . The titles of the director Raghavendra Rao's earlier movies like Annamaiah, Bhakta Ramadasu, and Shirdi Sai have been named after the respective devotees and not the Gods. Activists in Karimnagar are opposing the title for not naming it after the Saint Hathiram Baba and instead they named it as 'Om Namo Venkatesaya'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu