twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ' గా కె. రాఘవేంద్రరావు

    By Srikanya
    |

    విశాఖపట్నం: విశాఖపట్నంలోని టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం మంగళవారం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు 'విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ' బిరుదును ప్రదానం చేసింది. శివరాత్రిని పురస్కరించుకుని విశాఖ సాగరతీరంలో 'మహాశివ సంగీత నృత్య నాటక వైభవం' పేరుతో భారీ ఎత్తున పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ సందర్భంగా కళాపీఠం అధ్యక్షుడు ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు 'విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ' బిరుదును ప్రకటించారు. బంగారు కంకణం తొడిగి ఘనంగా సత్కరించారు.

    కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు.. సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, నటులు మోహన్‌బాబు, జయసుధ, జయప్రద, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు బీచ్‌రోడ్డులో టి.ఎస్‌.ఆర్‌ సేవాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి లింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

    K. Raghavendra Rao honoured by Viswa Vikhyata Darsaka Brahma.

    కెరీర్ ఆరంభంలో కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకులుగా ఎదిగిన రాఘవేంద్రరావు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత భక్తిరస చిత్రాల వైపు మళ్ళారు. ‘అన్నమయ్య', ‘శ్రీరామదాసు', ‘పాండురంగడు', ‘శిరిడి సాయి' వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించారు. ప్రేక్షకులు వీటికి బ్రహ్మరథం పట్టారు.

    కె.రాఘవేంద్రరావు తెరకేక్కిచిన ఆధ్యాత్మిక చిత్రాలలో ‘అన్నమయ్య'ది ప్రత్యేక స్థానం. అప్పటివరకు శృంగార పరమైన చిత్రాలను, కమర్షియల్ చిత్రాలను రూపొందించిన రాఘవేంద్రుడు తొలిసారిగా తన బాణీ మార్చుకున్నారు. కమర్షియల్‌ అంశాలను పక్కన పెట్టకుండా తెలుగు తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. గొప్ప చిత్రంగా ప్రతి ఒక్కరి ప్రసంశలను అందుకుంది.

    ఆయన తాజా చిత్రం విషయానికి వస్తే..

    దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. వేంకటేశుని భక్తుడు ‘అన్నమయ్య'గా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని పాత్ర వహించారు నాగార్జున. ఇప్పుడు ఏకంగా సాక్షాత్‌ వేంకటేశ్వరుడి పాత్రలో నటించడానికి సిద్ధమౌతున్నారట.

    రాఘవేంద్రరావు, నాగ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీరామదాసు, షిరీడిసాయి' వంటి ఆధ్యాత్మిక చిత్రాలు ఎంత పెద్ద హిట్‌ సాధించినవో చెప్పక్కర్లేదు. మళ్లీ వీరి కాంబినేషన్‌లో ‘ఏడుకొండలవాడు' తెరకెక్కబోతుందని సమాచారం. షిరీడిసాయి చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్మార్‌ సాయుకృప ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మహేష్‌రెడ్డి ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారని సమాచారం.

    ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారని ఫిలింనగర్‌ సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.

    English summary
    Well-known film director K. Raghavendra Rao honoured by TSR Kalaapeetham with the title of Viswa Vikhyata Darsaka Brahma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X