»   » దర్శకుడు గుణశేఖర్‌కి కె.వి.రెడ్డి అవార్డ్

దర్శకుడు గుణశేఖర్‌కి కె.వి.రెడ్డి అవార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యువ కళావాహిని ఆధ్వర్యంలో సాంస్కృతికబంధు సారిపల్లి కొండలరావు సారథ్యంలో ప్రతి ఏటా జగదేకదర్శకుడు కె.వి.రెడ్డి పేరుమీద ప్రధానం చేస్తున్న చలనచిత్ర దర్శక పురస్కారం ఈ సారి ప్రముఖ తెలుగు దర్శకుడు గుణశేఖర్ అందుకోబోతున్నారు.

ఈ 30వ చలనచిత్ర దర్శక పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్ లోని ప్రసాద్ పిలింల్యాబ్ లో ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, దర్శకరత్న దాసరి నారాయణరావు హాజరవుతున్నారు.

K.V Reddy award 2015 to Gunasekhar

విశిష్ఠ అతిథిగా ప్రసాద్ ఫిలింల్యాబ్ అధినేత అక్కినేని రమేష్ ప్రసాద్ హాజరవుతున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించనున్నారు. గౌరవ అతిథులుగా చలసాని అశ్వినీదత్, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ల భరణి, , జివి. నారాయణరావు, యం.వి.ఎస్ హరనాథరావు, యం దివాకరబాబు, తోట ప్రసాద్, ఎ.కె.అయ్యంగార్ హాజరవుతున్నారు.

అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా అంటే మధ్యాహ్నం 3.15 గంటలకు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి' చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించబోతున్నారు.

English summary
K.V Reddy Award-2015 Presentation to Tollywood director Gunasekhar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu