For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లీకైన కబాలీ డైలాగ్ తో... పోలా... ఫేస్ బుక్ మొత్తం అద్దిరిపోలా

  |

  సూపర్ స్టార్ రజినీ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే లక్షల హిట్ల తో దూసుకుపోతుంది. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన కబాలీ సినిమా రజినీ స్టైల్ తో మళ్లీ ఫ్యాన్స్ మంత్ర ముగ్ధులను చేయటం ఖాయమనిపిస్తుంది. బాషా మూవీ పోలికలతో ఉన్న ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

  కబాలీ దెబ్బకి ఇంకొక సారి బాక్సాఫీస్ సునామీ వచ్చే లాగానే ఉంది. సింగిల్ గా వస్తేనే రచ్చ చేసే సింహం ఈ సారి రెండు భారీ ఫ్లాపుల తర్వాత మరింత ఆకలితో వస్తోంది. ర‌జ‌నీ క‌బాలీ మూవీలో మ‌లేషియాను శాసించే డాన్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 6

  5 ఏళ్ల ఏజ్‌లో కూడా ర‌జ‌నీ చాలా ఎన‌ర్జీతో ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ డాన్ రోల్ పోషించారు."తెలుగు చిత్రాల్లో ఇక్కడ గాటు పెట్టుకుని.. మీసం మెలి తిప్పుకుని.. లుంగీ కట్టుకుని పాత విలను ఏయ్ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా.. కబాలి రా..! అంటూ ట్రైలర్లో వచ్చినడైలాగ్ కే అభిమానులే కాదు మామూలు సినీ ప్రేమికులు కూడా వెర్రెత్తిపోయారు.

  "Kabali" audio song, dialogues leaked online ahead of teaser release

  థియేట్రికల్ ట్రైలర్.. ఆడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నెలలో 12న గ్రాండ్‌గా ఫంక్షన్‌ చేసి ఆడియోను విడుదల చేయాలనుకున్నా.., ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో విహార యాత్రలో ఉన్న మన సూపర్‌స్టార్ ఆ సమయానికి చెన్నైలో అందుబాటులో ఉండలేకపోవడం వల్లనే ఆడియోను నేరుగా ఆడియో స్టోర్‌లకు విడుదల చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే...

  అయితే ఇంతలోనే ఎవరో "కబాలి" తమిళ ట్రైలర్లోని ఓ డైలాగ్ లీక్ చేసేశారు. కొన్ని పాటల ట్రాక్స్ కూడా లీకైపోయాయి. ఇంతకీ ట్రాక్ లో వినిపించే ఆ డైలాగ్ ఏమిటంతే "నాన్ వందిట్టాన్ సొల్లు.... తిరింబి వందిట్టాన్ సొల్లు.. 25 వర్షతుకు మున్నాలే ఎప్పిడి పోనాలో కబాలి.. అప్పిడే వందిట్తాన్ సొల్లు.. కబాలి డా" (నేను వచ్చానని చెప్పు ...తిరిగొచ్చానని చెప్పు..25ఏళ్ళకు ముందు ఎలావెళ్ళిన కబాలి...అలాగే వచ్చాడని చెప్పు..కబాలి రా...!)

  పోలా అదిరి పోలా.... ఉర్రుతలూగించే హీరోయిజం,స్టైల్ రజినీ సొంతం.... ఇక ఆల్ టైం హిట్ బాషా లాంటి క్యారెక్టర్..ఇక రజినీ విజృంబన ఏరేజి లో ఉంటుందో అన్న ఆసక్తితోనే ఎదురు చూస్తున్నారు తెలుగు తమిళ సినీ ప్రేమికులు.

  నిన్న సోషల్ మీడియాలో లీకవడం ఆలస్యం.. ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయింది ఈ డైలాగ్. టీజర్ వచ్చే కబాలి థీమ్ మ్యూజిక్కే దీనికి కూడా వాడారు. మరోవైపు లీకైన పాటలు కూడా బాగున్నాయనే అంటున్నారు. ఆదివారమే నేరుగా మార్కెట్లోకి విడుదల కానుంది 'కబాలి' ఆడియో. జులై 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు.

  English summary
  A portion of an audio song and with compilation of some dialogues of "Kabali" were leaked online on Friday, June 10. Some miscreants close to the production house is believed to be behind this act.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X