»   » అతడు అరెస్టయ్యాడు...కబాలి వల్లే అంటూ జోక్స్, లాభిస్తుందా?

అతడు అరెస్టయ్యాడు...కబాలి వల్లే అంటూ జోక్స్, లాభిస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాకు రంగానికి ఉన్న ప్రధానమైన సమస్య పైరసీ. దీని వల్ల సినిమా వాళ్లు ఏటా కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. అయితే కబాలి సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందే ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ వెబ్‌సైట్‌ కేఏటీ(కిక్ఆస్ టోరెంట్)ను రన్ చేస్తున్న ఉక్రెయిన్‌ వాసి ఆర్టెమ్‌ వాలిన్‌ (30)ను పోలండ్‌లో  అరెస్టు కావడంతో కబాలి ఎఫెక్టే అంటూ సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి.

'కబాలి' సినిమా రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. కబాలి లీక్ చేయడం వల్లే ఈ సైటుకు ఆ గతి పట్టిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టెమ్‌ వాలిన్‌ అరెస్టు అయ్యాడు, సైట్ డౌన్ అయింది కాబట్టి కబాలి సినిమాకు ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు.


ఆర్టెమ్‌ వాలిన్‌ పట్టుకోవడంలో యాపిల్‌ క్రియాశీల తోడ్పాటు అందించినట్లు సమాచారం. అతడి 'ఐక్లౌడ్‌' ఖాతాలోని వివరాలను అధికారులకు అప్పగించి, ఉచ్చుబిగిసేలా చేసిందట ఆపిల్ సంస్థ. ఈ వెబ్ సైట్ చేస్తున్న పైరసీ వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.6,724 కోట్లు నష్టం వాటిల్లిందట.


పైరసీ చేయడం ద్వారా ఏడాదికి రూ.84.03 కోట్లు (12.5 మిలియన్‌ డాలర్లు) నుంచి రూ.149.92 కోట్లు (22.3 మిలియన్‌ డాలర్లు) వరకూ ఆర్జిస్తోందట ఈ సంస్థ. వెబ్‌సైట్‌ విలువ రూ.363 కోట్లు (54 మిలియన్‌ డాలర్లు) వరకూ ఉంటుందని అంచనా.


రజనీ రాక్స్..

టోరెంట్ ఓనర్ అరెస్ట్ అయ్యాడు.. రజనీ రాక్స్ అంటూ...


తలైవా ఎఫెక్ట్

తలైవా ఎఫెక్టే అంటూ అభిమాని ట్వీట్


రజనీకాంత్ వల్లే అని అంటున్నారు

రజనీకాంత్ వల్లే ఇలా జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది


కబాలి శిక్ష

కబాలి సినిమా లీక్ చేసినందుకు శిక్ష అంటూ ప్రచారం...


అనుకోకుండా జరిగింది కాదు..

ఇది అనుకోకుండా జరిగింది కాదు.. రజనీకాంత్ రాక్స్


షాకింగ్ రిజల్ట్

కబాలి సినిమా తన టోరెంట్ నుండి డౌన్ లోడ్ చేయడం వల్లే షాకింగ్ రిజల్ట్ అంటూ...


సిస్ట్ ఫార్మాట్..

కబాలి డౌన్ లోడ్ చేయాలని ప్రయత్నిస్తే టోరెంట్ దానంతట అదే అన్ఇన్ స్టాల్ అయి...సిస్టం ఫార్మాట్ అయింది.. రూటర్ క్రాష్ అయింది అంటూ...


English summary
Here's what people on social media have made the connection between KickAss Torrents boss being arrested and Kabali's leak online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu