»   » కబాలి: ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసిన ఫ్యాన్స్ టాక్ (వీడియో)

కబాలి: ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసిన ఫ్యాన్స్ టాక్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: రజనీకాంత్ అభిమానులు ఎదురు చూస్తున్న 'కబాలి'సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజైంది. చెన్నై, బెంగుళూరు ప్రాంతాల్లో పొద్దు పొడవక ముందే కబాలి బెనిఫిట్ షోలు పడ్డాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అభిమానులు బయటకు వస్తూ సినిమా సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫిల్మ్ బీట్ ప్రతినిధి సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకోవడానికి థియేటర్ల వద్దకు వెళ్లగా అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా అదిరిపోయిందని, మరో బాషఆలా ఉందని, ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.


అభిమానులు రజనీ సినిమా విజయం చూసి చాలా కాలం అయింది. రోబో తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద భారీ ప్లాపులుగా నిలిచాయి. కూతురు దర్శకత్వంలో వచ్చిన కొచ్చాడయాన్, తర్వాత వచ్చిన 'లింగా' చిత్రాలు భారీ ప్లాప్ టాక్ తో పాటు తీవ్ర నష్టాలనే మిగిల్చాయి.


ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రమోగాలకు పోకుండా తనదైన స్టైల్, తనదైన మ్యానరిజంతో అభిమానులకు కావాల్సింది అందించానే ఉద్దేశ్యంతో 'బాషా' రేంజిలో ఉండాలనే ఉద్దేశ్యంతో పా రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' సినిమా చేసిన రజనీకాంత్.... ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సారి రజనీ సినిమా హిట్టు ఖాయమనే నమ్మకాన్ని కల్పించాడు.


దేశంలో గతంలో ఏ సినిమాకు లేని విధంగా వినూత్న ప్రచారం చేయడం ద్వారా సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేసారు. సినిమా అభిమానుల అంచనాలకు తగిన విధంగా ఉండటంతో 'కబాలి' ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో? అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..


కబాలి ఫ్యాన్స్ రెస్పాన్స్

శుక్రవారం ఉదయం కబాలి షో చూసిన తర్వాత అభిమానుల స్పందన ఈ వీడియోలో చూడొచ్చు.


మరో బాషాలా ఉంది

మరో బాషాలా ఉంది

సినిమా మరో బాషాలా ఉందని, రజనీకాంత్ స్టైల్, మ్యానరిజ్ అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు.


సూపర్ హిట్

సూపర్ హిట్

సినిమాలో బోరింగ్ అంశాలు పెద్దగా ఏమీ లేవని, అందరికీ నచ్చుతుందని అంటున్నారు ఫ్యాన్స్.


 నిర్మాతల్లో ఆనందం

నిర్మాతల్లో ఆనందం

సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ చూసిన తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి.


English summary
Rajinikanth starrer Kabali is in theatre now and everybody is super excited to watch the film. We reached the venue to catch the public reaction just after the FIRST DAY FIRST SHOW. As expected Public went crazy over Rajinikanths MINDBLOWING and SPECTACULAR performance. Watch what they liked and what they dont liked about the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu