»   » నచ్చకే ఇన్నాళ్లు దూరం: కబాలి మసుగులో రజనీని బాగా వాడేస్తున్నారు!

నచ్చకే ఇన్నాళ్లు దూరం: కబాలి మసుగులో రజనీని బాగా వాడేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చాలా మంది ఇండియన్ సినీ సూపర్ స్టార్స్‌ను పలు కార్పొరేట్ కంపెనీలు కొనేసాయి...వారి అకౌంట్లలో కోట్లు గుమ్మరించి తమ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నాయి. కానీ కార్పొరేట్ కంపెనీల గుమ్మరించే డబ్బుకు లొంగని, అమ్ముడుపోని హీరోల్లో రజనీకాంత్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.... అఫ్ కోర్స్ తెలుగులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడనుకోండి.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో బ్రాండ్ ప్రమోషన్స్ చేయించాలని చూసిన చాలా సంస్థలు ఆయన్ను ఒప్పించలేక వెనుదిరిగాయి. అయితే కార్పొరేట్ సంస్థలకు 'కబాలి' సినిమా రూపంలో మంచి అవకాశం దొరికినట్లయింది. ఈ సినిమాతో సరికొత్త కాన్సెప్టుకు తెరలేపారు.


వాస్తవానికి రజనీకాంత్‌కు వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఇష్టం ఉండదు. కానీ కార్పొరేట్ కంపెనీలు తెలివిగా కబాలి నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకుని రజనీకాంత్ 'కబాలి' పోస్టర్లను, సీన్లను వాడుకుంటూ, రజనీలాగా మిమిక్రీ వాయిస్ చేయించి ప్రకటనలు గుప్పిస్తున్నారు. రజనీకాంత్ ఇమేజ్ ను కావాల్సినంతగా వాడుకుంటున్నారు.


ఇలా చేయడం ద్వారా అటు సినిమాకు పబ్లిసిటీ జరుగడంతో పాటు తమ బ్రాండ్లకు కూడా కావాల్సినంత ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు కాడ్బరీ ఫైస్టార్ చాకొలేట్ యాడ్ తీసుకుంటే....సూపర్ స్టార్ యొక్క ఫైవ్ స్టార్ అంటూ కబాలి పోస్టర్లతో, బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేస్తుంది. యూట్యూబ్ లో కూడా ఎక్కువగా సూపర్ స్టార్ ఫైవ్ స్టార్ అంటూ యాడ్స్ వస్తున్నాయి.


ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ వారు 'ఫ్లై లైక్ ఎ సూపర్ స్టార్' అంటూ తమ విమానాలపై కబాలి పోస్టర్లను ముద్రించాయి. దీంతో ఆకాశంలో కూడా కబాలి ప్రమోషన్లు జరిగినట్లవుతోంది. ఇలాంటి ప్రచారం దేశంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరుగలేదు.


సిల్వర్ నాణేలు

సిల్వర్ నాణేలు

మరో వైపు కేరళ బేస్డ్ ముత్తూట్ ఫిన్ కార్ప్ సంస్థ సినిమా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుని రజనీకాంత్ కబాలి బొమ్మలతో సిల్వర్ కాయిన్స్ రిలీజ్ చేసింది. ఒక సినిమా స్టార్ విషయంలో ఇంత క్రేజ్ రావడం ఇదే తొలిసారి.


ఆశ్చర్యం

ఆశ్చర్యం

ఇలాంటి సంస్థలన్నీ రజనీకాంత్ కబాలి సినిమాతో ఒప్పందం కుదుర్చుకోవడం ఒక ఎత్తయితే... ఇమామి సంస్థ వారు ఉత్పత్తి చేస్తున్న ఫెయిర్ అండ్ హాండ్సమ్ బ్రాండ్ ను కబాలి సినిమాతో కలిసి ప్రమోట్ చేయడం మరొక ఎత్తు. ఈ యాడ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.


నలుపు

నలుపు

సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో ఆయన స్కిన్ కలర్ (నలుపు)ను పొగుడుతూ సాంగులు, డైలాగులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సినిమాతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని, రజనీ నల్లగా కనిపించే కబాలి సినిమాలోని సీన్లను వాడుకుంటూ ప్రచారం చేయడం విడ్డూరం.


రజనీ

రజనీ

ఇన్నాళ్లు రజనీకాంత్ వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నా... ఆయన్ను, ఆయన ఇమేజ్ ను మరో విధంగా బాగా వాడుకోవడం ఎలాగో కబాలి సినిమాతో తేలిపోయింది. ఇకపై రజనీకాంత్ సినిమాలన్నింటికీ ఇలాంటి ప్రమోషన్లు మోతమ్రోగనున్నాయి.


English summary
Superstar Rajinikanth is not known to have endorsed any product or service but the frenzy of brands and corporates associating with the movie Kabali seems to throw up a new concept in brand promotion, said a brand consultant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu