»   » నా కూతురు విషం చిమ్మింది.... పూజా బేడీపై తండ్రి ఫైర్

నా కూతురు విషం చిమ్మింది.... పూజా బేడీపై తండ్రి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి తన 70వ యేట పెళ్లి చేసుకున్నారు. 70 వ పుట్టినరోజుకి ఒక రోజు ముందు స్నేహితురాలు 42 ఏళ్ల పర్వీన్‌ దుసాంజ్‌ను వివాహం చేసుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఆయన పర్వీన్‌తో సహజీవనం చేస్తున్నారు. శనివారం కబీర్‌ బేడి పుట్టినరోజు సందర్భంగా ఆయన బంధువులు, స్నేహతులు, శ్రేయోభిలాషులను వేడుకకు ఆహ్వానించారు.

కబీర్ బేడీకి ఇది నాలుగో పెళ్లి. పర్వీన్ దుసాంజ్ కంటే ముందు కబీర్‌ బేడీ ప్రతిమాబేడీ, సుసాన్‌ హంఫ్రీస్‌, నిక్కీబేడీలను వివాహమాడారు. ఆ వివాహాలన్నీ విడాకులతో ముగిశాయి. అయితే ఈ వివాహంపై బాలీవుడ్ నటి, కబీర్ బేడి కూతురు పూజా బేడీ ట్విట్టర్ ద్వారా మండి పడ్డారు. తన తండ్రిని వివాహం చేసుకున్న పర్వీన్ దుసాంజే, తన జీవితంలోకి వచ్చిన దెయ్యమని నిన్న పూజా వ్యాఖ్యానించారు.

Kabir Bedi slams daughter Pooja for making 'venomous comments' against his wife

అయితే పూజా బేడీ వ్యాఖ్యలపై కబీర్ బేడీ తీవ్రంగా స్పందించారు. "నా భార్య పర్వీన్ పట్ల నా కూతురు విషం చిమ్మడంతో తీవ్రంగా బాధపడుతున్నా. పెళ్లి చేసుకోగానే ఇలా మాట్లాడటం తగదు. ఈ చెడు ప్రవర్తనను క్షమించలేను" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు.

తాను ఎంతో ఆనందంతో వివాహం చేసుకుంటే, ఆనందానికి అడ్డుపడుతూ విషం చిమ్ముతోందని కుమార్తె పూజా బేడీపై, ఏడు పదుల వయసులో వివాహం చేసుకున్న కబీర్ బేడీ నిప్పులు చెరిగాడు. అయితే వెంటనే పూజా బేడీ తన ట్వీట్ నే తొలగించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... మా నాన్న నాలుగో పెళ్లిపై చేసిన ట్వీట్ డిలీట్ చేసారు. ఆయన పెళ్లి విషయాన్ని పాజిటివ్ తీసుకుంటున్నాను. అయన్ను విష్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.

English summary
"DEEPLY DISAPPOINTED by venomous comments by my daughter Pooja against parveendusanj just after we married. NO excuse for bad behaviour" KABIR BEDI tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu