»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో విలన్ పాత్రలో ఇతడే...

‘సర్దార్ గబ్బర్ సింగ్’లో విలన్ పాత్రలో ఇతడే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతను మెయిన్ విలనా? లేక సినిమాలోని విలన్లలో ఒకరా? అనేది తేలాల్సి ఉంది. ‘జిల్' సినిమాతో తెరంగ్రేటం చేసిన కబీర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమాలో చేసే అవకాశం దక్కడంపై చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు.

Kabir Duhan Singh in Sardaar Gabbar Singh!

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం టీజర్ ని సైతం విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    The latest update is that Kabir Duhan Singh, Baddie in Pawan Kalyan’s Sardaar Gabbar Singh.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu