»   » 'బజరంగీ భాయ్‌జాన్‌' డైరక్టర్ కు సర్జరీ

'బజరంగీ భాయ్‌జాన్‌' డైరక్టర్ కు సర్జరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: సల్మాన్ ఖాన్ తో 'బజరంగీ భాయ్‌జాన్‌' వంటి సూపర్ హిట్ చిత్రం తీసిన బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి కడుపునొప్పిగా ఉందని కబీర్‌ చెప్పడంతో ఆయన్ను హుటాహుటిన ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రికి తరలించారు.

పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతన్ని కడుపులో రాయి ఉందని అప్పటికప్పుడే సర్జరీ చేసినట్లు సన్నిహితులు తెలిపారు.ప్రస్తుతం కబీర్‌ ఆరోగ్యం కుదుటపడడంతో శనివారం డిశ్చార్జ్‌ చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఈ విషయాన్ని ఆయన భార్య మణి మత్తూర్ ఖరారు చేసి తెలిపింది. కబీర్ కు మైనర్ సర్జరీ చేసారు. ఇప్పుడు ఇంటికి వచ్చేసారు, కొద్ది రోజులు పాటు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు అని తెలిపారామె.

Kabir Khan was rushed to the hospital

ప్రస్తుతం... కబీర్‌ సల్మాన్‌తో ట్యూబ్‌లైట్‌(వర్కింగ్‌ టైటిల్‌)సినిమా తెరకెక్కించనున్నారు. సల్మాన్‌-కబీర్‌ ఖాన్‌ కాంబినేషన్లో 2015లో విడుదలైన 'బజరంగీ భాయ్‌జాన్‌' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో మరో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. దీన్ని నిర్ధారిస్తూ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తన ట్విట్టర్‌లో... 'అవును.. మేమిద్దరం కలిసి 2017 ఈద్‌కు వస్తున్నాం' అని ట్వీట్‌ చేశారు.

ఇదో ఇండో-చైనీస్‌ సినిమా కావడంతో ఇందులో నటులను కూడా చైనా నుంచే ఎంపిక చేసుకోనున్నారు. ఇంతకముందు ఇందులో సల్మాన్‌కి జంటగా దీపికను తీసుకోవాలనుకున్నారు. కానీ సినిమాలో తన పాత్ర అంత నచ్చలేదని దీపిక ఒప్పుకోలేదు.

ఇంతకుముందు సుల్తాన్‌ చిత్రం కోసం దీపికను సంప్రదిస్తే డేట్లు కుదరక చేయనని చెప్పింది. ఇప్పుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించనున్న 'ట్యూబ్‌లైట్‌'(వర్కింగ్‌ టైటిల్‌) కోసం దీపికను ఎంపిక చేసుకుందామనుకున్నారు.

పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటే తప్పకుండా నటిస్తానని దీపిక చెప్పింది. పాత్రలో మార్పులు చేయడానికి కబీర్‌ ఖాన్‌ ఒప్పుకోలేదు. దీంతో దీపిక సినిమా నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. కాబట్టి దీపిక, సల్మాన్‌లను తెరపై జంటగా చూడాలంటే అభిమానులు ఇంకొంత కాలం ఓపిక పట్టాల్సిందే..!

English summary
“Kabir was brought to Kokilaben hospital after he complained of severe stomach pain. The doctors detected the stone, so he was immediately operated on. Now the director is stable and he even got discharged the next day. However, the doctors have strictly asked him to take rest for at least a week”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu