twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యూజికల్ లవ్ స్టోరీ ( 'కడలి' ప్రివ్యూ)

    By Srikanya
    |

    కార్తీక్‌ నట వారసుడు గౌతమ్‌ కార్తీక్‌ నటించిన 'కడలి' నేడు థియేటర్లలో సందడి చేయనుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా అంచనాలనే కాదు, ఎన్నో విశేషాలను కూడా మోసుకొస్తోంది. తెలుగు,తమిళ భాషల్లో ఒకే సారి విడుదల అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు మణిరత్నం కావటం,ప్రేమ కధా చిత్రం కావటం ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. చిత్రంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఏమిటంటే..

    కార్తీక్‌, రాధ జంటను వెండితెరకు పరిచయం చేస్తూ 1981లో వచ్చిన చిత్రం 'అలైగల్‌ ఓయ్‌వదిల్త్లె'. 32 ఏళ్ల తర్వాత కార్తీక్‌ కుమారుడు గౌతమ్‌ కార్తీక్‌, రాధ కుమార్తె తులసి హీరో,హీరోయిన్స్ గా జనం ముందుకొస్తున్న సినిమా 'కడలి'. పేరుకు తగ్గట్టే ఇందులో ఎక్కువశాతం సన్నివేశాలు తీరంలోనే తెరకెక్కించారు. 'అలైగల్‌ ఓయ్‌వదిల్త్లె'లో కార్తీక్‌ హిందూ యువకుడిగా, రాధ క్రైస్తవ యువతిగా కనిపించారు. ఇందులో గౌతమ్‌ కార్తీక్‌ క్రైస్తవ యువకుడిగా కనిపించనున్నాడు. రెండింటిలోనూ ప్రధానాంశం ప్రేమే. తండ్రి కార్తీక్‌ 20వ ఏట తెరంగ్రేటం చేయగా, 'కడలి' ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌ కార్తీక్‌ వయసు 23 ఏళ్లు.

    'అలైగల్‌ ఓయ్‌వదిల్త్లె'లో సీనియర్‌ నటుడు త్యాగరాజన్‌, సిల్క్‌స్మితతో కీలకపాత్రలు వేయించారు. వీరిద్దరూ దంపతులుగా; రాధకు అన్న, వదినలుగా కనిపించారు. 'కడలి'లోనూ అగ్రనటులకు స్థానం కల్పించారు. అరవింద్‌ స్వామి, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మణిరత్నం దర్శకత్వంలో అర్జున్‌ నటించటం ఇదే తొలిసారి. టాలీవుడ్‌ కలెక్షన్‌కింగ్‌ మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న చిత్రానికి మరో ఆకర్షణ.

    కార్తీక్‌తో 'అగ్ని నక్షత్రం', 'మౌనరాగం' తెరకెక్కించిన మణిరత్నం ప్రస్తుతం ఆయన కుమారుడు గౌతమ్‌ కార్తీక్‌తో 'కడలి' అందించారు. మోహన్‌ సరసన రాధతో 'ఇదయకోయిల్‌'ను రూపొందించిన మణిరత్నం, 'కడల్‌'లో రాధ కుమార్తె తులసిని కథానాయికగా ఎంచుకున్నాడు. తండ్రీ కొడుకులు, తల్లీకుమార్తె చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా ప్రత్యేకత దక్కించుకున్నాడు.

    'రోజా' నుంచి మణిరత్నంతో జట్టు కట్టిన స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ 'కడలి'లోనూ ప్రయాణాన్ని కొనసాగించాడు. వారిద్దరి కలయికలో వస్తున్న 12వ చిత్రమిది. మణిరత్నం కథానాయకుడ్ని వెండితెరకు పరిచయం చేస్తూ, ఆ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించటం ఇది రెండోసారి. గతంలో మాధవన్‌ మొదటిసినిమా 'సఖి'కి రెహమాన్‌ బాణీలు కట్టారు.

    బ్యానర్ : మద్రాస్ టాకీస్
    నటీనటులు :గౌతమ్ కార్తీక్, తులసి నాయర్, అర్జున్, అరవింద్ స్వామి, తంబి రామయ్య, లక్ష్మి మంచు
    కథ :జయ మోహన్
    సంగీతం: ఎ ఆర్ రహమాన్
    సినిమాటోగ్రఫి : రాజీవ్ మీనన్
    ఎడిటర్: శ్రీకర్ ప్రకాస్
    స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: మణిరత్నం
    నిర్మాత: ఎ మనోహర్ ప్రసాద్,మణిరత్నం
    విడుదల తేదీ : పిబ్రవరి 1, 2013

    English summary
    
 Kadal, the upcoming movie of ace director Mani Ratnam is a bi-lingual romantic movie, made in Tamil and Telugu simultaneously. In Tamil, the movie is named “Kadal” and in Telugu,it is “Kadali”. This Mani Ratnam’s movie is releasing with much anticipation this weekend on February 1, 2013. Kadal movie is set in the rural backdrop of fishermen’s lives interlaced with a love story. Yesteryear hero Karthik’s son Gautham Karthik and Tulasi Nair, younger daughter of yesteryear actress Radha will make their debut in this film. The movie is set in the coastal regions of Rameshwaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X