చిరంజీవి ‘మా’ వెంటే, నాగబాబు ‘మా’ గుండెకాయ..
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొందిన కాదంబరి కిరణ్ కాస్త ఉద్వేగంగా స్పందించారు. భవిష్యత్తును పనంగా పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేసామని, ఈ ధర్మయుద్దంలో ధర్మం తమ వైపు ఉంది కాబట్టే గెలుపొందామని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తమ వెన్నంటి ఉన్నారని, ఆయన ఆశీస్సులు ఉన్నాయని....నాగబాబు మా గుండెకాయ లాంటి వారని, వారి సహకారం ఉండటం వల్లనే ఈ ఎన్నికల్లో గెలుపొందామని తెలిపారు. సినిమా ఆర్టిస్టులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని కాదంబరి కిరణ్ స్పష్టం చేసారు.

ఈ సందర్భంగా..... కాదంబరి కిరణ్ ‘ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనిదిరా....దొర ఏందిరో దొర పీకుడేందిరో' అనే పాటతో పాటు, ‘ఏం పిల్లో ఎల్దమస్తవా...ఏం పిల్లడో వెల్దమస్తావా' అంటూ పాటలు పాడి హడావుడి చేసారు. ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించకుండా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.


Click it and Unblock the Notifications











