twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛోటారాజన్‌ పాత్రలో మరో వారసుడు

    By Srikanya
    |

    ముంబై : ఒకప్పటి చీకటి సామ్రాజ్యాధినేత దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న 'ఒన్స్‌ ఆపాన్‌ ఏ టైం ఇన్‌ ముంబయి అగైన్‌' చిత్రంలో ముఖ్యపాత్రను అక్షయ్‌ కుమార్‌ పోషిస్తుండగా, ఆయన కుడి భుజం, విశ్వాసపాత్రుడైన ఛోటారాజన్‌ పాత్రలో తాను కనిపిస్తానని సర్ఫరాజ్‌ వెల్లడించారు. సర్బరాజ్ మరెవ్వరో కాదు... ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, రచయిత ఖాదర్‌ ఖాన్‌ కుమారుడు. మిలన్‌ లూత్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

    సర్ఫరాజ్‌ ఖాన్‌(37) ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రామయ్య వస్తావయ్యా'(తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా')చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. సర్ఫరాజ్‌ ఇది వరకే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించారు. వాటిలో తేరే నామ్‌ (2003), బ్లాక్‌ ఫ్రైడే (2004), స్లమ్‌ డాగ్‌ మిలియనీయర్‌ (2008), వాంటెడ్‌ (2009) చిత్రాలున్నాయి.

    హిందీ చిత్ర నిర్మాత కుమార్‌ తురానీ కుమారుడు గిరీష్‌ తురానీని వెండి తెరకు పరిచయం చేస్తూ నిర్మిస్తున్న 'రామయ్య వస్తావయ్యా' చిత్రంలో తాను ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు ఖాన్‌ తెలిపారు. ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్రను పోషించే అవకాశం ఇన్ని రోజుల తర్వాత లభించినప్పటికీ ఈయన నాటక రంగంలో ఇప్పటికే మంచి పేరును గడించడం విశేషం. రామయ్య వస్తావయ్యాతో పాటు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో మిలన్‌ లూత్ర దర్శకత్వంలో 'ఒన్స్‌ ఆపాన్‌ ఏ టైం ఇన్‌ ముంబయి అగైన్‌' చిత్రంలోనూ నటిస్తున్నట్లు ఖాన్‌ పేర్కొన్నారు.

    English summary
    Veteran actor-writer Kader Khan’s son Sarfaraz, is set to get a boost in Bollywood, as director Prabhudheva has signed him on for his next film. Meanwhile, the actor reveals that he is also playing a significant role in Milan Luthria’s Once Upon A Time In Mumbaai Again. “I am Dawood’s (played by Akshay Kumar) trusted right-hand man, Chota Rajan in the film,” says an excited Sarfaraz.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X