»   » మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌...లాంటి తోకలేంటి? అంతా సమానం!

మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌...లాంటి తోకలేంటి? అంతా సమానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్, కలెక్షన్ కింగ్.....ఇలా సినిమారంగంలో స్టార్ల పేర్ల ముందు స్టార్లు యాడ్ అయ్యాయి. అప్పట్లో ఈ పేర్లు వారి సినిమాలను ఫలితాలను బట్టి వచ్చాయి. ఈ మధ్య కాలంలో వారసత్వంతో సినిమా రంగంలోకి అడుగు పెడుతున్న కొందరు కుర్రస్టార్స్ తొలి సినిమాలకే ఆ ఆస్టార్, ఈ స్టార్ అని తమ పేర్ల ముందు ఏవో తగిలించుకుని వస్తున్నారు.

అయితే నటుల పేర్ల ముందు ఇలాంటివి పెట్టడాన్ని తప్పుబడుతున్నారు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. నవ్య ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...పూర్వం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. నటనలో ఒకరిని మించి మరొకరు చేయాలన్న పోటీతత్వం ఉండేది. అదే ఇప్పుడు చూసుకుంటే ఈర్ష్యాభావంతో ఉంటున్నారు. అవతలి వాడికి సాంగ్‌ ఉంటే నాకూ సాంగ్‌ ఉండాలనే రీతిగా ఉంటున్నారే తప్ప ఫలితం బాగుండాలనే వాతావరణం లేదన్నారు.

Kaikala Satyanarayana about Today's generation Stars

దీనికి కొంతవరకు మీడియా కూడా కారణం. ఒకప్పుడు విమర్శ కూడా నిష్కర్షగా ఉండేది. మంచిని మంచిగా, తప్పుల్ని తప్పులుగా చూపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కలెక్షన్‌కింగ్‌, రెబల్‌స్టార్‌, మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ ఏంటి ఇవన్నీ... నటీనటులందరూ సమానమే కదా. మంచి ఉంటే పొగడండి, చెడు ఉంటే విమర్శించాలి. అప్పుడే నటులకి మంచి చేసిన వాళ్లవుతారు. అలాకాకుండా అనవసరంగా పొగడడం వల్ల కృషి లేకుండానే పెద్ద వాళ్లని చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అంటూ ఆయన నవ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

English summary
Kaikala Satyanarayana criticized today's generation Stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu