»   » వెర్రెక్కిన ఫ్యాన్స్: కాజల్ అగర్వాల్‌‌ ఇరుక్కుంది (వీడియో)

వెర్రెక్కిన ఫ్యాన్స్: కాజల్ అగర్వాల్‌‌ ఇరుక్కుంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోలు, హీరోయిన్లు పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ చుట్టు ముట్టి ఇబ్బంది పెడతారు. ఒకరు ఇద్దరు ఉంటే ఫర్వాలేదు కానీ... వందల మంది అభిమానులు ఉన్న చోట పరిస్థితి దారుణంగా ఉంటుంది. హీరోయిన్ల పట్ల కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించడం లాంటి కూడా చేస్తుంటారు. గతంలో పలు సందర్భాల్లో హీరోయిన్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవం ఎదుర్కొంది. తమిళ చిత్రం ‘పాయుమ్ పులి' మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా ఆమెను అభిమానులు చుట్టు ముట్టి ఇబ్బంది పెట్టారు. దీంతో చిర్రెత్తిన కాజల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను వేధిస్తున్న అభిమానులను కొట్టినంత పని చేసింది.

‘పాయుమ్ పులి' తెలుగులో ‘జయసూర్య' పేరుతో...
పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశాల్ కథానాయకుడిగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మరో యాక్షన్ ఎంటర్టెనర్ రూపొందుతోంది. తమిళ్ లో ‘పాయుమ్ పులి'గా, తెలుగులో ‘జయసూర్య'గా ఈచిత్రం విడుదలవుతుంది.

సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారథ్యంలో రూపొందుతున్న ‘జయసూర్య' చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న తమిళం, తెలుగులో విడుదలవుతోంది.

Kajal Agarwal harassed by fans

ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ...‘ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను. మంచి మాస్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ సినిమా నా కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

నిర్మాత జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ...‘విశాల్, కాజల్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున నిర్మాణం జరుపుకుంటున్న చిత్రమిది. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆగస్టు 21న ‘జయసూర్య' ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా హీరో విశాల్ కు, మా బేనర్ కు సూపర్ హిట్ మూవీ అవుతుందన్న నమ్మకం ఉంది' అన్నారు.

విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హరీష్ ఉత్తమన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్, మాటలు: శశాంక్ వెన్నెల కంటి, ఎడిటింగ్: ఆంటోని, పాటలు: సాహితి, వన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, సారథ్యం: వడ్డి రామానుజం, తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత: జువ్వాజి రామాంజనేయులు దర్శకత్వం: సుశీంద్రన్.

English summary
Actress Kajal Aggarwal was mobbed by her crazy fans during the launch of her upcoming Tamil movie 'Paayum Puli'. The crowd that gathered at the audio launch to get a glimpse of their favourite actress went berserk thus creating a commotion at the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu