»   » తెలుగు సినిమాలలో బికినీయా ఏమైనా ఉందా, కానీ హిందీలో బికినీకి ఓకే

తెలుగు సినిమాలలో బికినీయా ఏమైనా ఉందా, కానీ హిందీలో బికినీకి ఓకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా తెరమీద మగధీరతో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకున్న కాజల్ అగర్వాల్ మొట్టమొదటిసారి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడమే టూ పీస్ బికినీతో బాలీవుడ్ జనానికి వలవేయాలని అనుకుంటుందంట. దీనికి కారణం తమిళంలో సింగం సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

తమిళ సింగం సినిమాలో అందాల తార అనుష్క తన అందాలను చాలా తెలివిగా ప్రదర్శించడం జరిగింది. తన అందంలో యావత్ తమిళ తంబిల మతి పోగోట్టిన విషయం తెలిసిందే. దాంతో ఈసినిమాని హిందీలో రూపోందిస్తున్న తరుణంలో, హిందీ వెర్షన్‌లో కాజల్ అందాలను ప్రత్యేకంగా చూపించాలని చిత్ర దర్శకుడు కాజల్ సోగసులపై స్పెషల్ ఫోకస్ పెట్టాడని సమాచారం.

ఇది మాత్రమే కాకుండా కాజల్‌ని టూ పీస్ బికినీలో చూపించాలనే ప్రయత్నాలు బాలీవుడ్‌లో జరుగుతుంటే కాజల్ కూడా ఈసినిమాలో బికినీ వేయడానికి ఒప్పుకుందని సమాచారం. గతంలో బికినీ లాంటి దుస్తులు నాకు సూట్ అవ్వవు అని చెప్పిన కాజల్ ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమా అనగానే ఒక్కసారి బికినీకి రెడీ అయిపోయిందని ఫిలిం నగర్ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి కాజల్ మాత్రం తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉంది. ప్రభాస్ సరసన మిస్టర్ ఫర్‌పెక్ట్ అనే చిత్రంలో నటించింది. ఈసినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక నాగచైతన్యతో నా డ్రీమ్ లవర్ అనే సినిమాలో బుక్ అయ్యింది. అలాగే రవితేజ సరసన వీర అనే సినిమాలో నటిస్తున్నారు.

English summary
It was a relentless contestant between South Indian actresses, especially the Kollywood gals on bagging the offer of ‘Singam’ Hindi remake. Initially talks were that Anushka, who played the female lead opposite Surya in Tamil and Telugu version, will sign the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X