»   » జిమ్‌లో సందడి చేసిన కాజల్, నిషా (ఫోటోలు)

జిమ్‌లో సందడి చేసిన కాజల్, నిషా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ సిస్టర్స్ కాజల్ అగర్వాల్, ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఓ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేసారు. అందరితో పాటు ఉత్సాహంగా స్టెప్పులేసారు. గోల్డ్ జిమ్‌లో జుంబా సెషన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా వారు హాజరయ్యారు. వీరితో పాటు నటుడు అర్జున్ భజ్వా కూడా ఉన్నారు.

ముంబైకి చెందిన కాజల్ అగర్వాల్ 'క్యూ హోగయానా' అనే హిందీ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. అయితే ఈ చిత్రం ఆమెకు పెద్దగా గుర్తింపు తేలేదు. ఆ తర్వాత 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ తెలుగులో తొలి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్.....ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారింది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

మగధీరతో దశ తిరిగింది

మగధీరతో దశ తిరిగింది

మగధీర చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు, ఈచిత్రంలో కాజల్ నటనకు మంచి మార్కులు పడటంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ రేంజికి చేరంది.

కాజల్ బాటలో నిషా

కాజల్ బాటలో నిషా

కాజల్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావడంతో...ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ తెరంగ్రేటం వీజీ అయిపోయింది. ఒక రకంగా కాజల్ తన చెల్లిలి కోసం పలువురు దర్శకులు, నిర్మాతలను అడిగి అవకాశాలు తెచ్చి పెట్టింది.

నిషా తెరంగ్రేటం

నిషా తెరంగ్రేటం

కాజల్ చెల్లులు అనే ట్యాగ్ ఉండటంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిషా....తొలి సినిమా ‘ఏమైంది ఈ వేళ' చిత్రంతో నటించింది. ఈచిత్రం మంచి విజయం సాధించడంతో నిషాకు గుర్తింపు వచ్చింది. అయితే నటనలో పూర్ అనే విమర్శలు వచ్చాయి.

సోలో చిత్రంతో నటిగా గుర్తింపు

సోలో చిత్రంతో నటిగా గుర్తింపు

తొలి సినిమా ‘ఏమైంది ఈ వేళ‌'లో నటిగా పెద్దగా మార్కులు తెచ్చుకోలేక పోయిన నిషా అగర్వాల్ ఆ తర్వాత వచ్చిన ‘సోలో' చిత్రంతో మాత్రం నటన పరంగా, అందం పరంగా మంచి మార్కులే కొట్టేసింది.

హీరోయిన్‌గా బిజీ

హీరోయిన్‌గా బిజీ

నిషా అగర్వాల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె తెలుగులో డికె బోస్ అనే చిత్రంలో నటిస్తోంది. అక్క కాజల్ అండ ఉండటంతో నిషా కెరీర్ సజావుగానే సాగుతోంది.

English summary
Tollywood star sisters Kajal Agarwal and Nisha Agarwal Launches Zumba Session at Gold Gym. Kajal Aggarwal is an Indian film actress, who predominantly appears in South Indian cinema. Nisha Aggarwal is an Indian film actress who appears in Telugu and Tamil films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu