»   » రిలీజ్ కాకపోతే బాగుండునని కాజల్

రిలీజ్ కాకపోతే బాగుండునని కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిశ్రమలో దాదాపు నెంబర్ వన్ స్టేజికి వచ్చిన కాజల్ కి ఇప్పుడు కెరీర్ భయం పట్టుకుంది. మొదటి ప్లేసులో ఉన్న తాను ఆ ప్లేస్ ని కాపాడుకోవాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె తను ఎంపిక చేసే చిత్రాల కథలు శ్రద్దగా వింటోంది.దర్శకులను, హీరోల ట్రాక్ రికార్డులు పరిశీలించి డేట్స్ ఇస్తోంది. అయితే తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం నా పేరు శివ టైటిల్ తో విడుదలైంది. అయితే ఆ సినిమా తమిళంలోనూ పెద్దగా ఆడలేదు. దాంతో ఆమెకు ఇక్కడ ఆ సినిమా విడదల కావటం ఇష్టం లేదుట.కాని ఆ సినిమా విడుదల కావటం.. వారు ప్రమోషన్ కి రమ్మనటంతో బాదపడుతోంది. మరో ప్రక్క హిందీలో చేసిన సింగం సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. అక్కడ నుంచి ఆపర్స్ ఏమీ తెచ్చిపెట్టలేదు. ఈ నేపధ్యంలో ఆమె తాజా చిత్రం దడ విడుదలకు సిద్దమైంది. నాగచైతన్య సరసన చేసిన ఈ చిత్రంపై ఆమె ఆశలు పెట్టుకుంది. అజయ్ భుయాన్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం మంచి హిట్ అయ్యి మళ్ళీ తనను టాప్ పొజీషన్ లోనే ఉంచుతుందని భావిస్తోంది.

English summary
Kajal Agarwal, who has been riding high in Tollywood with a hat-trick of hits Darling, Brindavanam and Mr.Perfect and her recent bollywood hit Singham is reportedly not happy with Karthi-Kajal recent release Naa Peru Shiva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X