Just In
- 44 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆఫర్ల కోసం దిగజారలేదు.. మగవాళ్ల బుద్ది మారాలి.. క్యాస్టింగ్ కౌచ్‌పై కాజల్
దక్షిణాదిలో అగ్రహీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న కాజల్ అగర్వాల్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ (సినిమా ఆఫర్ కోసం పడక గదిలోకి) గురించి మరోసారి స్పందించారు. ఇటీవల కాలంలో ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల కెరీర్‌లో నాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని ఆమె వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బాలిక సంరక్షణ, సినిమా పరిశ్రమలోని కొన్ని సమస్యలపై ఆమె మాట్లాడారు.

క్యాస్టింగ్ కౌచ్ గురించి కాజల్
సినిమా పరిశ్రమలో నిజంగా నేను అదృష్టవంతురాలిని. నాకు ఎలాంటి ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి వినడం తప్ప అది ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. అసలు ఇలాంటి సమస్య హీరోయిన్లకు నిజంగా ఎదురవుతుందా? లేదా? అని కాజల్ పేర్కొన్నారు.

మగవాళ్ల బుద్ది మారాలి
సమాజంలో మగవాళ్లను బాధ్యతాయుతంగా ఉండాలని నేను కోరుతాను. ఆడపిల్లలకు సురక్షితంగా ఉండాలని పాఠాలు, నీతులు చెప్పడం కాదు ఆచరణలో పెట్టి చూపించాలి. ప్రతీ ఇంటిలో అమ్మాయి ఉండటం సహజం. వారిపట్ల మర్యాదగా వ్యవహరించాల్సిందే అని కాజల్ అన్నారు.

శ్రీరెడ్డి మళ్లీ స్పందిస్తుందా?
దక్షిణాదిలో క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలనాత్మకమైన రీతిలో పోరాటం చేస్తున్నారు. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు చేయడం వివాదమైంది. తాజాగా అదే అంశంపై కాజల్ స్పందించడంపై శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

క్వీన్ రీమేక్ చిత్రంలో
పదేళ్లకుపైగా కెరీర్‌లో కాజల్ అగర్వాల్ 50కి పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల అజిత్ కుమార్‌తో వివేకం, కల్యాణ్ రామ్‌తో ఎమ్మెల్యే చిత్రంలో నటించారు. ప్రసుత్తం హిందీలో ఘన విజయం సాధించిన క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు.