»   »  కాజల్ నువ్వు కూడానా..!? ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అవసరమా??

కాజల్ నువ్వు కూడానా..!? ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అవసరమా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్మటిక్ సర్జరీలు చేయించుకునే సౌత్ హీరోయిన్లు ఒకప్పుడు అరుదే కాని.. ఈ మధ్య చాలామంది ఈ కోవలోకి వచ్చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా వచ్చిన కొత్తలో ఒక రకం ముక్కుతో కనిపిస్తే ఇప్పుడు మరో రకం ముక్కుతో దర్శనమిస్తోంది. కాజల్ ముక్కుకి సర్జరీ చేయించుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అవకాశాలు తగ్గుతోన్న క్రమంలో తాను మరింత అందంగా కనిపించవలసిన అవసరాన్ని గుర్తించిన కాజల్, సర్జరీ ద్వారా తన ముక్కుతీరు మార్చుకుందని అంటున్నారు. గతంలో ఆమె ఫోటోలు .. ఇప్పటి ఫోటోలు చూస్తుంటే తేడా స్పష్టంగా తెలుస్తోందంటూ నెటిజన్లు చెబుతున్నారు.

Kajal Aggarwal Plastic Surgery Before and After

తెలుగులో మరీ ఎక్కువ సినిమాలు లేకపోయినా తమిళ్ సినిమాలలో మంచి అవకాశాలే వస్తున్నాయి ఈ చందమమామకు. కాకపోతే ఇక్కడ ఈ మధ్య ఓ రెండు పెద్ద సినిమాలు చేసింది కాబట్టి.. వరుసగా రానాతో కళ్యాణ్ రామ్ తో చిన్న సినిమాలు బాగానే పడ్డాయ్. అయితే మళ్ళీ తన కెరియర్ స్పీడ్ ని పెంచాలి అంటే ఏదో తెలియని మ్యాజిక్ చేయాలి అని అనుకోని తన ముక్కు కొంచం మార్చుకుంది అంట.

ఈ విషయం ఆమె బయటకు చెప్పకపోయినా కాజల్ ను ఈ మధ్యకాలంలో చూసిన ప్రతివారికి ఆమె ముక్కు కొత్తరకంగా ఉందనే అనిపిస్తోందని టాక్. మొన్న ఆమె షేర్లో చేసిన కళ్యాణ్ రామ్ ని ఎమ్మెల్యే సినిమా షూటింగ్ స్పాట్ స్టిల్స్ లో కూడా ముక్కు తేడాగా ఉందని అంటున్నారు నెటిజన్లు.

English summary
Tollywood beauty Kajal Aggarwal appears to have gone for nose job for beauty enhancement. If we observe her face we can identify that she has gone for nose surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu