»   » కాజల్ అగర్వాల్ హిందీలో కూడా, హిందీ టెంపర్ హీరో ఎవరంటే

కాజల్ అగర్వాల్ హిందీలో కూడా, హిందీ టెంపర్ హీరో ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పోలీసాఫీసర్‌గా నెగటివ్ టచ్‌తో దుమ్మురేపిన చిత్రం టెంపర్. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. బీటౌన్ యాక్షన్ అండ్ కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

తాజాగా ఈ రీమేక్ మూవీలో రణ్ వీర్ సింగ్‌ను హీరోగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. 'టెంపర్' హిందీ రీమేక్ గురించి చాన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. కానీ సినిమా అయితే ఖరారవ్వలేదు. ఎట్టకేలకు 'టెంపర్' హిందీ రీమేక్ ఓకే అయింది. అనుకున్న కాంబినేషన్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది.

టెంపర్' హిందీ రీమేక్‌

టెంపర్' హిందీ రీమేక్‌

పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్లోకి అడుగుపెట్టి.. వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించిన రణ్వీర్ సింగ్ ‘టెంపర్' హిందీ రీమేక్‌లో హీరోగా నటించనున్నాడు. యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్లు తీయడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం రణ్వీర్.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావతి' చేస్తున్నాడు.

రణ్ వీర్ సింగ్

రణ్ వీర్ సింగ్

బాలీవుడ్‌లో ఇప్పటి యంగ్ హీరోస్‌లో అగ్రపథాన దూసుకుపోతు న్నాడు రణ్ వీర్ సింగ్. ప్రస్తుతం రణ్ వీర్ సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావతి', జోయా అక్తర్ 'గల్లీ బోయ్స్' చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటి తర్వాత ఈ రీమేక్ మూవీ ఆరంభం కానుంది. ప్రస్తుతం 'గోల్ మాల్ ఎగెయిన్'తో బిజీగా ఉన్న రోహిత్ శెట్టి త్వరలో 'టెంపర్' రీమేక్ ప్రి-ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టనున్నాడట.

Jr NTR Crazy Fan Following Peaks : Watch Here | Filmibeat Telugu
కాజల్ అగర్వాల్‌నే

కాజల్ అగర్వాల్‌నే

అన్నీ కుదిరితే ఒరిజినల్ 'టెంపర్'లో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్‌నే బాలీవుడ్ రీమేక్‌లోనూ తీసుకోనున్నాడట రోహిత్ శెట్టి. మరి నెగటివ్ షేడ్స్‌తో మొదలై పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఎండ్ అయ్యే 'టెంపర్' చిత్రంతో రణ్ వీర్ సింగ్ ఎలా అలరిస్తాడో చూడాలి.

రోహిత్ శెట్టి

రోహిత్ శెట్టి

రోహిత్ శెట్టి ‘గోల్ మాల్' సిరీస్‌లో కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్లు ఆ కమిట్మెంట్లు పూర్తి చేయగానే ‘టెంపర్' రీమేక్ పట్టాలెక్కుతుంది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దీన్ని మార్చి తీయబోతున్నారట. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించిన దయా పాత్రలో రణ్వీర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

English summary
Now that remake rights of the Telugu blockbuster ‘Temper’ has officially been acquired by Rohit Shetty, rumour mills are abuzz with news of the actress Kajal Aggarwal in the original film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu