»   » సర్దార్ గబ్బర్ సింగ్: ప్రిన్సెస్‌గా కాజల్ హాట్‌లుక్ (ఫోటోస్)

సర్దార్ గబ్బర్ సింగ్: ప్రిన్సెస్‌గా కాజల్ హాట్‌లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో చాలా స్లో అయిపోయింది. అయితే తాజాగా ఆమెకు పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' మూవీలో నటించే అవకావం దక్కడంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ స్పీడు అందుకుంటుందని భావిస్తోంది.

ఈ సినిమాలో కాజల్ ఏంజిల్ లుక్ తో కనిపించబోతోంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా విడుదలయ్యాయి. ఆమె లుక్ ప్రినెస్స్ రేంజిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ బడోదరలోని లక్ష్మి విలాస్ ప్యాలెస్ లో జరుగుతోంది. షూటింగ్ జరిగే ప్రదేశాన్ని బట్టి సినిమాలో ఆమె పాత్ర కూడా ప్రిన్సెస్ తరహాలో ఇందుకు ఉంటుందని సమాచారం.

అభిమానుల కోసం కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆమె లుక్ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. లక్ష్మి విలాస్ ప్యాలెస్ లో సూటింగ్ ముగియగానే... వాంకెనర్ లోని రంజిత్ విలాస్ ప్యాలెస్ లో షూటింగ్ ఉంటుందని సమాచారం. ఇక్కడ పవన్ కళ్యాణ్, కాజల్ మధ్య పలు కీలకమైన సీన్లు చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో మరో హీరోయిన్ సంజన కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇక హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ స్పెషల్ సాంగులో అభిమానులను అలరించనుంది. సర్దార్ గబ్బర్ సినిమాలో కాజల్ అగర్వాల్ కు సంబంధించిన మరిన్ని ఫోటోలు స్లైడ్ షోలో.....

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ప్రిన్సెస్ తరహాలో ఉంటుందని సమాచారం.

అదిరింది

అదిరింది


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి కాజల్ అగర్వాల్ విడుదల చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

కాజల్ లుక్

కాజల్ లుక్


తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్వయంగా కాజల్ అగర్వాల్ ఇందుకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేయడం విశేషం.

స్టైలిస్ట్

స్టైలిస్ట్


సినిమాలో కాజల్ అగర్వాల్ తన పర్సనల్ స్టైలిస్ట్ అర్చా మోహతా డిజైన్ చేసిన దుస్తులు వాడుతోంది. అదే విధంగా తన ఓన్ బ్రాండ్ మర్సాలా జ్యువెలరీ వాడుతున్నట్లు తెలుస్తోంది.

కాజల్

కాజల్


ప్రస్తుతం షూటింగ్ బడోదరలోని లక్ష్మి విలాస్ ప్యాలెస్ లో జరుగుతోంది. లక్ష్మి విలాస్ ప్యాలెస్ లో సూటింగ్ ముగియగానే... వాంకెనర్ లోని రంజిత్ విలాస్ ప్యాలెస్ లో షూటింగ్ ఉంటుందని సమాచారం.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' మూవీలో నటించే అవకావం దక్కడంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ స్పీడు అందుకుంటుందని భావిస్తోంది.

English summary
Kajal Aggarwal, who earlier missed a couple of interesting projects of Pawan Kalyan, has finally grabbed the actor's next offering, Sardaar Gabbar Singh. While this much awaited pair up have already generated enough buzz, Kajal Aggarwal's angelic look from the film is now creating more excitement among moviegoers.
Please Wait while comments are loading...