»   » పవన్ కళ్యాణ్ ప్రియురాలు ఆమెనా....?

పవన్ కళ్యాణ్ ప్రియురాలు ఆమెనా....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ‘సర్దార్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది. ఇటీవలే పవన్‌కల్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో పవన్ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ అనుకున్నారు. సినిమా ప్రారంభం కాక ముందే ఆమెను పక్కకు తప్పించారు. ఇపుడు కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

Kajal Aggarwal - Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా భారీ గెడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన షూటింగులో గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో కనిపించారు. దీన్ని బట్టి ఆయన ‘సర్దార్' సినిమాలో ఆయన గడ్డంతో కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.

మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం కావడం, పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కావడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఇక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నీ సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

English summary
Film Nagar source said that, Kajal Aggarwal to star opposite Pawan Kalyan in 'Sardar'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu