»   » షాక్: అక్కడ ఓటరుగా కాజల్‌(ఫొటో)

షాక్: అక్కడ ఓటరుగా కాజల్‌(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓటరు నమోదు కార్యక్రమం ఎంత పగడ్బందీగా జరిగినా ఎక్కడో చోట తప్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ నమోదు కార్యక్రమం లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ ఓటరుగా నమోదైంది. జాబితాలో ఆమె పేరు చూసిన స్థానికులు మీడియాకు సమాచారమిచ్చారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ గ్రామంలోని పలువురి వివరాలు ఓటరు జాబితాలో తప్పుగా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజల్ సైతం ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యిందని తెలుస్తోంది.

Kajal as a Voter In Medak

కాజల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా గోవిందుడు అందరివాడే చిత్రంలో చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...రామ్‌చరణ్ కాంబినేషన్‌తో నేను చేసిన సినిమాలన్నీ ఆడాయి. అంటే మా కాంబినేషన్‌ను జనం ఇష్టపడుతున్నారు. అతనితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేస్తున్నా. ఇందులో కాస్త రెబల్‌గా ఉండే కేరక్టర్ చేస్తున్నా. అది నాకు బాగా నచ్చింది. అలాగే అది నైస్ ఇంటరెస్టింగ్ స్టోరీ. అందులో భాగం కావడం ఆనందంగా ఉంది అంది.

ఇక "పారితోషికం సమస్య వల్ల తెలుగులో గ్యాప్ తీసుకున్నాననేది కేవలం రూమర్. పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.

English summary
Kajal shoked to know that her Vote registered at Medak. Voting is one of the most important responsibilities of citizens in a democracy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X