»   » హాట్ బ్యూటీ కాజల్ కామెంట్స్.. మండిపడుతున్న తెలుగు పరిశ్రమ

హాట్ బ్యూటీ కాజల్ కామెంట్స్.. మండిపడుతున్న తెలుగు పరిశ్రమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లక్ష్మీ కళ్యాణం తో పరిచయమైన ముంబై భామ కాజల్ వరసగా హిట్స్ తో తెలుగులో స్టార్ స్ధాయికి ఎదిగింది.ఆ స్టేటస్ అండతో ఆమె హిందిలో తెలుగు యముడు రీమేక్ సింగంలో అనూష్క చేసిన పాత్రను చేసింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె ముంబైలో మీడియాతో మాట్లాడుతూ...నేనెప్పుడూ దక్షినాదికి చెందిన నటిగా ఫీలవటం లేదు.నేను అస్సలు అక్కడ నటిని అని కన్సిడర్ చేయను అంది. హిందిలో ఫెయిల్యూర్ అయి ఇక్కడకి వచ్చి ఎదిగిన ఆమె ఇక్కడ పరిశ్రమను లెక్కచేయననటం పరిశ్రమలోని పెద్దలను బాధపెట్టింది.

కొందరు సీనియర్స్..తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకుండా ముంబై అమ్మాయిలను ఇంపోర్టు చేసుకుంటే ఇలాగే ఉంటుందని అంటే,మరికొందరు ఈ హీరోయిన్స్ చెన్నైలో ఉంటే మిగతా ప్లేసులను తిడతారు.ముందైలో ఉంటే అస్సలు ఒళ్ళూ పై తెలియకుండా కామెంట్స్ చేస్తారు.హిందీ పరిశ్రమను చూసిన తర్వాత ఈ ఫీల్డ్ వారికి ఆనదు అన్నారు.అయితే సీనియర్ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఇదే విషయమై స్పందిస్తూ..హీరోయిన్స్ మాకు అవసరం కానీ ..వారి ఫీలింగ్స్ తో మాకు పనిలేదు.మేము ఏ బాషవారైనా,ఏ ప్రాంతం వారైనా పాత్ర డిమాండ్ వారిని పిలిపించుకుని వారితో పనిచేస్తూంటాం అని తేల్చి చెప్పారు.

English summary
Talking to media in Mumbai for the promotion of film "Singham," Kajal was quoted as saying, "I have never considered myself a South Indian actress."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu