»   » 'గోవిందుడు అందరివాడేలే' లో కాజల్ లుక్ ఇదీ(ఫొటో)

'గోవిందుడు అందరివాడేలే' లో కాజల్ లుక్ ఇదీ(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్ లో కృష్ణవంశీ రూపొందించుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . ఈ చిత్రంలో కాజల్ లుక్ ప్రత్యేకంగా డిజైన్ చేసారు. పలెల్టూరు అమ్మాయిగా ఆమె విలక్షణమైన పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఆమె కట్టు,బొట్టు మొత్తం మార్చారు. మీరు ప్రక్కన చూస్తున్న ఫొటో ఆ చిత్రంలోదే. కృష్ణవంశీ మరోసారి మురారి నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయాలనే కసితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజల్ ఈ చిత్రం విజయంపై పూర్తి నమ్మకంగా ఉంది.

కాజల్‌ మాట్లాడుతూ ''విజయం నన్ను మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే.. అప్పుడే ప్రపంచం మనల్ని ఇంకాస్త ఎక్కువగా గమనించడం మొదలెడుతుంది. మన ప్రతి కదలిక వాళ్ల చూపు దాటి పోదు. ఇలాంటప్పుడే చిన్న తప్పుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుంది. అందుకే హిట్‌ రాగానే.. కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటా. గత సినిమాలకంటే ఓ మెట్టు పైకి ఎక్కక పోయినా ఫర్వాలేదు. కానీ.. ఓ మెట్టు దిగకూడదు. నటన విషయంలో నాకు నేను పెట్టుకొనే నియమం ఇదే. ఈ విషయంలో నేనెప్పుడూ ఓడిపోలేదు. అందుకే నటిగా నేనెప్పుడూ సంతృప్తికరమైన ఫలితాలనే సాధించా'' అని చెబుతోంది.

Kajal in Govindudu Andarivadele

అలాగే ''విజయం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగితే ఫర్లేదు. కానీ... అహంకారం చోటు చేసుకొంటేనే సమస్యలొస్తాయి. నేనెప్పుడూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటా'' అంటోంది కాజల్‌. ప్రస్తుతం 'గోవిందుడు అందరివాడేలే' చిత్రీకరణలో బిజీగా ఉంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త లుక్ తో కనిపించటం కూడా చాలా ఆసక్తిని రేపుతోంది. దానికి తోడు ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు. కృష్ణ వంశీ తన చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో మరోసారి ఇండస్ట్రీకి ప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి. అందులో ఇప్పటికే రెండు పాటలను షూట్ చేసారు. రామ్ చరణ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. కృష్ణవంశీ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.


English summary
Wearing a black and white designer half-saree, Kajal oozes loads of oomph factor in this look from the upcoming movie 'Govindudu Andarivadele'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu