నాగచైతన్య ‘దడ’కు 'హాట్ ప్రాపర్టీ' కాజల్..!

'వరుసగా 'ఏ మాయ చేసావే', '100% లవ్' సినిమాలు సక్సెస్ సాధించడంతో హీరో నాగచైతన్యకు మార్కెట్ మెల్లిగా పెరుగుతోంది. దాంతో అతని రెమ్యునేరేషన్ పెరగడంతో బాటు, సినిమాల బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కానున్న నాగచైతన్య తదుపరి చిత్రం 'దడ' బాగా లాభపడుతోంది. పైగా, ఆ సినిమాలో టాలీవుడ్ 'హాట్ ప్రాపర్టీ' కాజల్ హీరోయిన్ కావడంతో దానికి మరింత క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కుల్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఇందుకు గాను రైట్స్ రూపంలో నిర్మాతకి పన్నెండు కోట్లు చదివించుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఇప్పటికే రాజన్న, ఊసరవెల్లి సినిమాల డిస్ట్రిబ్యుషన్ రైట్స్ ను కూడా పొందింది.


Click it and Unblock the Notifications











