మెగాస్టార్ అల్లుడి చిత్రం విజేత షూటింగ్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న విజేత చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విజేత చిత్రం ద్వారా కల్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మురళీశర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
విజేత చిత్రానికి బాహుబలి ఫేం కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:
కల్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ల భరణి, మురళీశర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కల్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయ ప్రకాశ్, ఆదర్శ్ బాలకృష్ణ, నోయెల్ సీన్, కీర్తీ, భద్ర, సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు.
తెర వెనుక:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ సాహి
నిర్మాత: రజనీ కొర్రపాటి
సినిమాటోగ్రాఫర్: కేకే సెంథిల్ కుమార్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: రెహ్మన్, రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ


Click it and Unblock the Notifications











