»   » కళ్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్, ఇక బ్యాంకాక్‌లో షేర్

కళ్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్, ఇక బ్యాంకాక్‌లో షేర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్ చంద్ సమర్పణలో మల్లికార్జుజ్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘షేర్'. డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు(జులై 5) సందర్భంగా ‘షేర్' యూనిట్ శుభాకాంక్షలు తెలిపారు. యూనిట్ సమక్షంలో నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే కేక్ కట్ చేసారు.

జులై 10 నుండి బ్యాంకాక్ లో ‘షేర్'
ఈ సందర్భంగా నిర్మాత కొముర వెంకటేష్ మాట్లాడుతూ... ‘జులై 10 నుండి 15 వరకు బ్యాంకాక్, పటాయలలో పాట చిత్రీకరించడంతో టోటల్ గా షూటింగ్ పూర్తవుతుంది. నిర్మాతల శ్రేయస్సును కోరే నందమూరి కళ్యాణ్ రామ్ తో ఈ మూవీ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. మా దర్శకుడు మల్లికార్జున్ ‘షేర్' చిత్రాన్ని సూపర్ హిట్ చిత్రంగా రూపొందించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో సెన్నేషనల్ హిట్ గా ‘షేర్' అందరి ఆదరణ పొందుతుంది. ఆగస్టులోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

Kalyan Ram Birthday

నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌ చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, ఆలీ, పృథ్వి, షఫి, ప్రియ, మౌనిక, ఆర్‌.కె. ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి, విక్రంజీత్‌ సింగ్‌, భరత్‌, రఘు కారుమంచి, జీవా, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, దువ్వాసి మోహన్‌, గిరి, తాగుబోతు రమేష్‌, సత్య, కాదంబరి కిరణ్‌, మాస్టర్‌ గౌరవ్‌, మాస్టర్‌ నిఖిల్‌, రామ్‌ప్రసాద్‌, రచ్చ రవి, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, గుండు సుదర్శన్‌, వేణుగోపాల్‌, జిమ్‌ క్యారీ, మౌళిక, సత్యశ్రీ, కీర్తి, శ్వేత, కోటేశ్వరరావు మిగతా పాత్రలు పోషిస్తున్నారు.

Kalyan Ram Birthday

ఈ చిత్రానికి కథ`మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, డాన్స్‌: దినేష్‌, గణేష్‌, జాని, పాటలు: కందికొండ, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: శేషు బలగ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: జయరాజా సింగ్‌, కుమారస్వామిరెడ్డి, గీతా సి.శేఖర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: అనిరుధ్‌, నల్లమల వెంకటేష్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: మల్లికార్జున్‌.

English summary
Sher team Birthday wishes to Kalyan Ram.
Please Wait while comments are loading...