»   » జూ ఎన్టీఆర్ ను ఫాలో కావడం వల్లే కళ్యాణ్ రామ్ బోల్తా

జూ ఎన్టీఆర్ ను ఫాలో కావడం వల్లే కళ్యాణ్ రామ్ బోల్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో కావడం వల్లే కళ్యాణ్ రామ్ దెబ్బ తిన్నారనే టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లేనని భావిస్తున్నారు. మొదటి రోజే థియేటర్లలో సీట్లన్నీ నిండ లేదు. ప్రచార హంగామా లేకపోవడం వల్లనే అందుకు ప్రధాన కారణమని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కత్తి సినిమాకు పెద్దగా ప్రచారం చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాకు ప్రచారం తక్కువ ఇచ్చారు. అయినా మంచి విజయం సాధించింది. అదే ఫార్ములాను కళ్యాణ్ రామ్ కత్తి సినిమాకు ఫాలో అయ్యారని అంటున్నారు. ఎన్టీఆర్ రేంజ్ వేరు, కళ్యాణ్ రామ్ రేంజ్ వేరనే విషయం అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందని అంటున్నారు. ఎన్టీఆర్ కున్న ఇమేజ్ తో కళ్యాణ్ రామ్ ఇమేజ్ ను పోల్చలేమని, ఆ మాటకొస్తే రామ్ చరణ్ ను కూడా పోల్చలేమని, అందువల్ల కళ్యాణ్ రామ్ వంటి హీరోల సినిమాలకు పబ్లిసిటీ అవసరమని సినీ వర్గాలంటున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu