»   » పూరి కోసం ..కళ్యాణ్ రామ్ కొత్త లుక్, షాక్ అవుతారు చూస్తే

పూరి కోసం ..కళ్యాణ్ రామ్ కొత్త లుక్, షాక్ అవుతారు చూస్తే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలి సినిమానుంచీ కళ్యాణ్ రామ్ ఏ సినిమాలో చేసినా పెద్దగా గెటప్ ఛేంజ్ లేకుండా ఒకేలా ఉంటూ వస్తున్నారు. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ మాత్రం దాన్ని బ్రేక్ చేయదలుచుకున్నారు. కళ్యాణ్‌ రామ్‌ను పూరీ జగన్నాథ్‌ స్టయిలిస్‌ లుక్‌లో చూపించ దలచుకున్నారు.

ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనబడనున్నాడు. ఎవరిని చంపాడానికి వస్తున్నాడంటూ కామెంట్‌ రాసి ఈ ఫొటోను పూరీ జగన్నాథ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

హెయిర్ స్టైల్, గడ్డం.. విషయంలో మార్పు తీసుకువచ్చి.. ఇలా కళ్యాణ్ రామ్ లుక్‌ను పూర్తిగా మార్చేశారు పూరీ. ఇక ఈ ఫోటోను పూరీ విడుదల చేసిన కొద్దిసేపటికే అన్ని వర్గాల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పూరీ స్టైల్లో ఓ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మిస్ ఇండియా 2015 .. అదితి ఆర్య ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఓకే చేస్తే ఇదే టాలీవుడ్ లో ఆమె తొలి చిత్రం. ఆమెను కలిసి ఇప్పటికే టీమ్ కథ ని వినిపించిందని తెలుస్తోంది. స్టోరీలైన్ నచ్చిన అదితి , ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవటానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు చెప్పిందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు.

 Kalyan Ram new look for Puri's film

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ..జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పటాస్ లోపోలీస్ గా కనిపించి అలరించిన కళ్యాణ్ రామ్ ...ఈ సినిమాలో జర్నలిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనుంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ దీనికి నిర్మాత. 'టెంపర్‌' తర్వాత పూరి జగన్నాథ్‌, 'పటాస్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కథ, కూర్పు, మాటలు, దర్శకత్వం పూరిజగన్నాథే.

English summary
Puri Jagannadh posted the photograph of the new look of Kalyan Ram. The fab makeover of Nandamuri Kalyan Ram is being appreciated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu