»   » నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే సినిమాలో... అభిమానులకు పండగే

నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే సినిమాలో... అభిమానులకు పండగే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొంతకాలం క్రితం హరికృష్ణ సినిమాల్లో మంచి ఉత్సాహంగా నటించారు. ఆయన పోషించిన పవర్ ఫుల్ రోల్స్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఆయన సినిమాలను తగ్గించుకున్నారు. అలాంటి హరికృష్ణ ఒక సినిమాలో కీలకమైన పాత్రను చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. వైవిఎస్ చౌదరి చొరవతో హరికృష్ణ చకచకా అనేక సినిమాలు చేసారు. కానీ ఆ తరువాత మళ్లీ వెనక్కు తగ్గారు. కానీ ఇప్పటికీ మంచి క్యారెక్టర్ పడాలే కానీ, హరికృష్ణ సినిమాకు ప్లస్సే అవుతారు. అందుకే హరికృష్ణను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

హరికృష్ణ సూటయ్యే మాంచి క్యారెక్టర్ వున్న కథపై కళ్యాణ్ రామ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాంటి కథ సెట్ కాగానే కళ్యాణ్ రామ్-హరికృష్ణ కలిసి ఓ సినిమాలో కనిపించే అవకాశం వుంది. బహుశా రాబోయే కొత్త సంవత్సరంలో ఈ కాంబినేషన్ నందమూరి అభిమానులను అలరించవచ్చు. కల్యాణ్ రామ్ తాను హీరోగా తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను పూర్తిచేసే పనిలో ఓ యువ దర్శకుడు ఉన్నాడని చెబుతున్నారు. ఈ కథలో హరికృష్ణ పాత్రను కీలకంగా .. వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుతున్నారట. ఇందులో ఒక సందర్భంలో ఎన్టీఆర్ కూడా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇలా ఈ ముగ్గురూ ఈ సినిమాలో కనిపించనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.

Kalyan ram planing a movi with Nandamuri harikrishna and ntr

అలాంటి కథ దొరికితే, జస్ట్ ఓ లుక్ లో ఎన్టీఆర్ కూడా కనిపించే ఆలోచన వుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి కథపై ఓ దర్శకుడు కసరత్తు చేస్తున్నాడట. అంటే నందమూరి అభిమానులు కూడా మనం లాంటి సినిమా చూస్తారేమో?

English summary
Latest industry buzz is that after a big flap wthi ijam Kalyan Ram planing A new project With hiself, Nandamuri HarikRshna and Junior NTR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu