»   »  బాలయ్య, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్లకు కళ్యాణ్ రామ్ రెడీ

బాలయ్య, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్లకు కళ్యాణ్ రామ్ రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘పటాస్' చిత్రం విజయంతో ఉత్సాహంగా ఉన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ విజయోత్సవ ర్యాలీలు ప్రారంభించాడు. అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకన్న ఆయన మాట్లాడుతూ మంచి కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి సిద్ధమే అని, బాబాయ్ బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పటాస్' మూవీ విడుదల రోజు నుండే మౌత్ టాక్ బావుండటం, రివ్యూలు కూడా అనుకూలంగా రావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సత్తా చాటింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం తొలివారం వరల్డ్ వైడ్ రూ. 13 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Kalyan Ram ready for a multi starrer

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

అనిల్ తో మరో సినిమా...
‘పటాస్' మూవీ విజయవంతం అయిన నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్ - దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ‘పటాస్' సినిమాను కళ్యాణ్ రామే స్వయంగా నిర్మించారు. సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో అనిల్‌తో మరో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపుతున్నారు.

ఈ విషయం గురించి కళ్యాణ్ రామ్ వివరిస్తూ ‘మా బ్యానర్ లో నేను అనిల్ కలిసి మళ్లీ తప్పక సినిమా చేస్తాం. అయితే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. తప్పకుండా తాత గారి సినిమాలను తలపించే సినిమా అవుతుంది. డిఫరెంటుగా ఉంటుంది' అని తెలిపారు.

English summary
Kalyan Ram who is enjoying the success of ‘Pataas’ on Friday celebrated it by watching the film along with fans in a theatre in Tirupathi. He said, he is ready to do a multi starrer if he gets good story.
Please Wait while comments are loading...