»   »  బర్త్ డే స్పెషల్: నందమూరి హీరో ‘షేర్’(ఫోటో)

బర్త్ డే స్పెషల్: నందమూరి హీరో ‘షేర్’(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై సాయి నిహారిక సమర్పణలో 'షేర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు (జులై 5) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.

గతంలో 'కత్తి' చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిఖార్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. మే 14వ తేదీ ఉదయం 7 గంటలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలోని సాయిబాబా గుడిలో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్ రామ్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సమర్పకురాలు బేబీ సాయి నిహారిక కెమెరా స్విచాన్ చేయగా తొలి షాట్ షిరిడి సాయి బాబా విగ్రహం చిత్రీకరించారు.

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...'కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా 'షేర్' క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సబ్జెక్టు చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్‌తో సూపర్ హిట్ తీయాలన్న కోరిక 'షేర్'తో నెరవేరబోతోందని తెలిపారు. నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ...మా విజలక్ష్మి బేనర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

 Kalyan Ram's Sher movie first look

నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఓ కొత్త హీరోయిన్ నటించే ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ముఖేష్ రిషి, ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే, విక్రంజిత్ సింగ్, అలీ, కృష్ణ భగవాన్, ఆర్.కె, రావు రమేష్, రోహిణి, ప్రియ, వేణుమాధవ్, షఫి, రఘుబాబు, తాగుబోతు రమేష్, పృథ్వీ, నర్రా శ్రీను, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, శ్రావణ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు డైమండ్ రత్నబాబు, రచనా సహకారం: ముద్ద నాగ, మేకప్: మోహన్ పరుచూరి, స్టిల్స్: మనీషా ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ : శివ, ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: సత్య శ్రీనివాస్, ఎడిటింగ్: ప్రవీఫ్ పూడి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సర్వేష్ మురారి, సంగీతం: చక్రి, ప్రొడక్షన్ మేనేజర్: బి.శ్రావణ్ కుమార్ గౌడ్, అసోసియేట్ డైరెక్టర్స్: మూర్తి, జగదీస్ సింగ్, కుమార స్వామి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్: అనిరుధ్, కో డైరెక్టర్: బూరుగపల్లి సత్యనారాయణ, కథ-మాటలు-దర్శకత్వం: మల్లికార్జున్.

English summary
Kalyan Ram's Sher movie first look poster released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu