»   » కళ్యాణ్ రామ్.... సిక్స్ ప్యాక్‌లో షాకింగ్ లుక్ (ఫోటోస్)

కళ్యాణ్ రామ్.... సిక్స్ ప్యాక్‌లో షాకింగ్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఇజం' పేరుతో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇతర ఫోటోల్లో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసారు. కళ్యాణ్ రామ్ తండ్రి నందమూరి హరికృష్ణ 60వ జన్మదినం(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో కళ్యాణ్ సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటుండటం విశేషం.


ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా చేసారు. ఇక్కడ ముగియడంతో ఆగస్టు నుండి స్పెయిన్‌లో భారీ షెడ్యూల్‌ జరురుగుతోంది. సెప్టెంబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.


స్లైడ్ షోలో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్ కు సంబంధించిన ఫోటోస్...


లుక్ అదిరింది

లుక్ అదిరింది

కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్ అదిరింది కదూ...


కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''పూరిగారితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, పూరిగారితో చేస్తున్న 'ఇజం' చిత్రం మరో ఎత్తు. ఒక డిఫరెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది'' అన్నారు.


పూరి

పూరి

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్తగా.. చాలా కొత్తగా కనిపిస్తాడు. జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నారు అన్నారు.


పవర్ ఫుల్

పవర్ ఫుల్

అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే చిత్రమిది. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఇది ఓ పవర్‌ఫుల్‌ సినిమా ఇది అని పూరి జగన్నాధ్ అన్నారు.


నటీనటులు

నటీనటులు

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.


English summary
Kalyan Ram's Six Pack Look in ISM. Puri Jagannadh has taken a record remuneration for his forthcoming film ISM, starring Kalyan Ram. The film release on 29 September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu