»   » కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ వెనుక సీక్రెట్ ఇదే... (వీడియో)

కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ వెనుక సీక్రెట్ ఇదే... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో సిక్స్‌ప్యాక్‌ చేసిన చివరి హీరో తానే అవుతానేమో అని నవ్వుతూ రీసెంట్ గా మాట్లాడిన కళ్యాణ్ రామ్, ఆ సిక్స్ ప్యాక్ కోసం ఎంత కష్టపడ్డారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. నవ్విపారేసే అంత ఈజీ టాస్క్ కాదది. అయితేనేం పట్టుదల ముందు ఏదైనా ఓడిపోతాయి.

సిక్స్‌ప్యాక్‌ కోసం మూడు నెలల పాటు కష్టపడి, దాదాపు పది కిలోలు తగ్గారు. మరి కల్యాణ్‌రామ్‌లోని 'ఇజం' చూపించడానికి ఏ విధంగా సిక్స్‌ప్యాక్‌తో తయారయ్యారో తెలుపుతూ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.ఇక హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈనెల 21 ఆయన తాజా చిత్రం 'ఇజం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్న ఆయన ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.


"ఇజం నా కెరీర్ లో ఒక స్పెషల్ చిత్రం గా నిలుస్తుంది అని నమ్ముతున్నాను. పూర్తి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్ ని ఈ చిత్రం లో డైరెక్టర్ పూరి గారు ప్రెసెంట్ చేసారు. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ కార్యకలాపాలు లాంటి అంశాలను ఈ చిత్రం టచ్ చేస్తుంది. అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నాం" అని నిర్మాత, హీరో అయిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.


ఇక హీరోలను పక్కా మాస్‌గా చూపించడంలో పూరి జగన్నాథ్‌ శైలే వేరు. 'ఇడియట్‌' నుంచి 'లోఫర్‌' వరకు ఆయన సినిమాల్లో హీరోలు రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉంటారు. కల్యాణరామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇజం'. గత చిత్రాలకు భిన్నంగా కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రంలో కన్పిస్తున్నారు.


 Kalyan Ram's Six Pack Making and Transformation for ISM

నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Watch Kalyan Ram's six pack making video.In this video, one could see how the actor is preparing himself his physique under the direction of a fitness trainer. Nandamuri Kalyan Ram, Jagapati Babu, Aditi Arya are the main casts of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu