»   » కమల్ గెస్ట్ గా ఇళయరాజా భారీ సంగీత విభావరి

కమల్ గెస్ట్ గా ఇళయరాజా భారీ సంగీత విభావరి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆగస్టు 24న లండన్‌లో భారీ సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కమల్‌ హాసన్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దక్షిణాదికి చెందిన పలువురు గాయకులతోపాటు 75 మంది ఆర్కెస్ట్రా సభ్యులు ఈ సంగీత విభావరిలో పాల్గొనబోతున్నారు. 'రాజా ది రాజా' పేరుతో నిర్వహించబోతున్న ఈ ప్రదర్శనలో ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోపాటు చిన్మయి, కార్తీక్‌, జయచంద్రన్‌, మధు బాలక్రిష్ణన్‌, సాధనా సర్గమ్‌ తదితరులు తమ గళాన్ని వినిపించబోతున్నారు. ఇళయరాజా కుమారులు యువన్‌ శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజా, కూతురు భవతారిని కూడా సంగీత విభావరిలో పాలుపంచుకోబోతున్నారు.

ఇక ఇళయరాజా అంటేనే అద్భుతమైన పాటలకు ప్రతిరూపం. ఇప్పుడాయన పాటలు లేకుండా ఓ సినిమాకి సంగీతం సమకూర్చుతున్నారు! వైవిధ్యం కోసం పరితపించే మిష్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓనాయుం ఆట్టుకుట్టియుం'. ఇందులో హీరోయిన్ కూడా లేదు.

చిత్ర విశేషాల గురించి దర్శకుడు ముచ్చటిస్తూ.. 'ఓనాయుం ఆట్టుకుట్టియుం' కోసం ఇళయరాజాను కలిశాను. గతంలో నా దర్శకత్వంలో వచ్చిన 'నందలాలా' చిత్ర సమస్య కారణంగా నన్ను ఆయన చూసిన వెంటనే 'ముందు బయటకు వెళ్లిపో..!' అన్నారు. ఆ సమస్యకు కొన్ని కారణాలు చెప్పాక 'ఓనాయుం..' గురించి విన్నారు. 'ఇందులో పాటలేవీ లేవు సార్‌..' అన్నాక ఎగాదిగా చూశారు.

కథ వినిపించాక 'తప్పకుండా చేస్తా'నని భరోసా ఇచ్చారు. ఆయన ఒప్పుకున్నాక నాకు మరింత బలం వచ్చింది. 'వళక్కు ఎన్‌..'లో నటించిన శ్రీ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. చిత్రీకరణ చివరిదశలో ఉంది. సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పాడు.

English summary
Kamal Haasan is all set to pack his bags to attend the concert by maestro Ilaiyaraaja in London. Apparently, Kamal Haasan had suffered an injury during the shoot of Vishwaroopam 2. The actor said that his wound would be healed once he attended the concert as he believed that Ilaiyaraaja's music did wonders to once psyche and could even heal a wound. The concert titled Raja The Raja and will be held on August 24 in London. Leading singers including SP Shailaja, JayaChandran, Yuvan Shankar Raja, Chinmayi and SP Balasubramaniyan will take part in the concert along with the maestro. Kamal Haasan is also expected to sing a few songs.
Please Wait while comments are loading...