»   » హీరోయిన్లతో ముద్దు సీన్ల కోసమే కమల్ హాసన్ అలా..!

హీరోయిన్లతో ముద్దు సీన్ల కోసమే కమల్ హాసన్ అలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూనివర్శల్ హీరో కమల్ హాసన్ సినిమాల్లో కనీసం ఒక్క లిప్ లాక్ ముద్దు సీన్ అయినా ఉండటం సర్వసాధారణం. సౌత్ హీరోల్లో ముద్దు సీన్ల ట్రెండు మొదలు పెట్టిందే ఆయనే అనేంతగా పాపులర్ అయ్యారు కమల్. త్వరలో విశ్వరూపం 2 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్....ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.

తనకు 11 ఏళ్ల వయసులోనే స్మోకింగ్ అలవాటయిందని, అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో ఆ అలవాటును మానుకున్నానని...అందులో ముఖ్య కారణం సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చేయడానికే అని వెల్లడించారు కమల్. తనకు స్మోకింగ్ అలవాటు ఉంటే ముద్దు సీన్లు చేసే సమయంలో హీరోయిన్లు ఇబ్బంది పడతారని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటలను బట్టి 'విశ్వరూపం 2' చిత్రంలో కూడా లిప్ లాక్ ముద్దు సీన్ ఉంటుందని స్పష్టం అవుతోంది.

యంగ్ జనరేషన్‌కు ఆయన ఇస్తున్న సందేశం ఏమిటంటే....కనీసం గర్ల్ ఫ్రెండ్స్, భార్యల కోసమైనా స్మోకింగ్ వదిలేయాలని, మీరు స్మోక్ చేయడం వల్ల వారు ఇబ్బంది పడతారనే విషయం గుర్తుంచుకోవాలని కమల్ హాసన్ సూచిస్తున్నారు. కమల్ హాసన్ సూచనను ఆయన అభిమానుల్లో ఎంత మంది పాటిస్తారో చూడాలి.

ఇక కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విశ్వరూపం 2 చిత్రం వివరాల్లోకి వెళితే, ఈ చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. తొలి భాగం విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన 'ఆరంభం' చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. మేజర్ వసీం ఆహ్మద్ కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

English summary
Actor Kamal Haasan who is working hard to release his magnum opus 'Vishwaroopam 2' soon, has revealed that he had started smoking at a young age of 11. But the star actor had quit smoking due to various reasons and one among those that top the list are the lip lock scenes that he had to do in his films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu