»   » కథువా దారుణం: కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, తాప్సీ, తమన్నా ట్వీట్స్

కథువా దారుణం: కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, తాప్సీ, తమన్నా ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Haasan Prakash Raj Taapsee Joins Justice Asifa Protest

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన దారుణం సౌత్ సినీ సెలబ్రిటీలు స్పందించారు. బాధితురాలికి న్యాయం జరుగాలంటూ జరుగుతున్న ఆందోళనలో కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, తాప్సీ, తమన్నా తదితరులు జాయిన్ అయ్యారు. సోషల్ మీడియాలో తమ గళం వినిపించారు.

సంచార బకర్వాల్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల చిన్నారి జనవరిలో 10న అపహరణకు గురైంది. వారం తర్వాత ఇంటి సమీపంలో శవమై కనిపించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాలికపై అత్యచారం, హత్య జరిగిందని తేల్చడంతో పాటు 8 మందిపై చార్జ్ షీట్ దాఖలైంది. సంచార జాతి(బకర్వాల్ కమ్యూనిటీ)వారిని తరిమివేసేందుకు కొందరు ఈ దారుణాలకు పాల్పడ్డారని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఛార్జీ షీటులో పేర్కొన్న ఆ నిందుతులు 8మందిలో ప్రధాన నిందితుడు సంజిరామ్(60, రిటైర్డ్ రెవెన్యూ అధికారి)తోపాటు సంజిరామ్ మేనల్లుడైన 15ఏళ్ల బాలుడు, దీపక్ ఖజూరియా(ప్రత్యేక అధికారి), పర్వేశ్ కుమార్(సంజిరామ్ మేనల్లుడి స్నేహితుడు), విశాల్ జంగోత్రా, తిలక్ రాజ్(హెడ్ కానిస్టేబుల్), ఆనంద్ దుత్తా(సబ్ ఇన్‌స్పెక్టర్), సురీందర్ కుమార్(ప్రత్యేక పోలీసు అధికారి) ఉన్నారు.

మీలాంటి చిన్నారులకు భద్రత లేదు

ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ... ‘మీ సొంత కూతురికి ఇలా జరిగితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక పురుషుడిగా, తండ్రిగా, పౌరుడిగా చిన్నారికి భద్రత కల్పించడంలో విఫలం అయ్యాం. నన్ను క్షమించు చిట్టితల్లి... ఈ దేశంలో మీలాంటి చిన్నారులకు భద్రత కల్పించలేక పోయాం. కనీసం భవిష్యత్ తరాల కోసం అయినా నేను పోరాటం చేస్తాను' అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

ఓక తండ్రిగా నా హృదయం చాలా బాధ పడుతోంది

ఓ వైపు ఉన్నావో కేసు, ఇపుడు 8 ఏళ్ల చిన్నారి.... ఒక తండ్రిగా నా హృదయం చాలా బాధ పడుతోంది. ఇంకా ఈ సమాజంలో ఎంత మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. మతరమైన నేరాలను ఇంకా ఎంతకాలం సహించాలి. ఇప్పటికైనా మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి, మేల్కొని ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

ఇలాంటి సమజాంలో మనం నివసిస్తున్నాం

రేపిస్టులు, హంతకులు మరియు సమాజంలోని ఒక విభాగం వారికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి సమజాంలో మనం నివసిస్తున్నాం. అంతా దేవుడు చూసుకుంటారని కొందరు అంటారు. కానీ చిన్నారిని గుడిలో మూడు రోజులు రేప్ చేశారు. మనం కానీ, కానీ దేవుడు ఆమెను కాపాడ లేదు.... అంటూ నటుడు ప్రియదర్శి ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

హీరోయిన్ తాప్సీ

ఇపుడు రేప్ లాంటి నేరాలు కూడా దేశం, మతం ఆధారంగా జరుగుతున్నాయి. ఈప్పటికైనా మనం ఇతరులను వేలెత్తి చూపడం మానేసి మన విఫలం అయిన విషయాన్ని ఒప్పుకోవాలి. కథువా ఘటన దేశం సిగ్గుపడేలా చేసింది... అంటూ హీరోయిన్ తాప్సీ వ్యాఖ్యానించారు.

ఈ దేశం ఎటు పోతోంది?

ఓ వైపు 8 ఏళ్ల చిన్నారిపై, మరో వైపు 16 ఏళ్ల బాలికపై అత్యచారం. ఈ దేశం ఎటువెళుతోంది. సంస్కరణలు అమలయ్యేలోపు ఇంకా ఎంత మంది నిర్భయలు తమ జీవితాలను త్యాగం చేయాలి. ఇప్పటికైనా ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం, అందకు తగిన చర్యలు తీసుకోవాలి అని తమన్నా ట్వీట్ చేశారు.

English summary
South actors Kamal Haasan, Prakash Raj, Thamanna, Taapsee and some celebs have condemned the brutal rape and murder of 8-year-old in Jammu and Kashmir's Kathua district and demanded justice for her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X