»   » ఓర్ని... తేజ, ఎన్. శంకర్ చెప్పింది బిల్డప్ కేనా

ఓర్ని... తేజ, ఎన్. శంకర్ చెప్పింది బిల్డప్ కేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్యన కమల్ తో చిత్రం ఓకే అయ్యిందంటూ అటు దర్శకుడు తేజ, ఎన్.శంకర్ లు పేపరు స్టేట్ మెంట్ లు ఇచ్చేసారు. వరస ఫ్లాపులతో ఖాళీ పడ్డ ఈ దర్శకులకు కమల్ హాసన్ చిత్రం ఏమిటంటూ అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏమోలే అంత అద్బుతమైన కథతో ఆయన్ను ఒప్పించారేమో అని మరికొందరు సరిపెట్టికున్నారు. అయితే కమల్ అలాంటిదేమి లేదని స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. దాంతో వీరి చెప్పిన మాటలు కేవలం తమ బిల్డప్ కు చెప్పినట్లు అయ్యింది.

తెలుగులో తను ఓ సినిమా అంగీకరించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విశ్వనటుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. అయితే తను కొంత మంది తెలుగు దర్శకులతో చర్చలు జరుపుతున్న విషయం వాస్తవమేననీ, వాటిల్లో ఏదీ ఫైనలైజ్‌ కాలేదని ఆయన తెలిపారు. 'తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. మా సొంతబేనరు రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌లోనే ఆ సినిమా చేస్తాను. 20 ఏళ్ల తరువాత నేను నటించే తెలుగు సినిమా ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో నేనుగానీ, నిర్మాత కుమార్‌బాబుగానీ వెల్లడిస్తాం' అన్నారు కమల్‌హాసన్‌.

Kamal Haasan Quashes Those Rumours

విశ్వనటుడు కమల్‌హాసన్‌ చిత్రాలు మూడు ఈ ఏడాది విడుదల కానున్నాయన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రోజురోజుకూ వేగాన్ని పెంచుతున్న ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా కమల్‌ నటించిన 'విశ్వరూపం-2' ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల చెంతకు రానుంది.

తన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న 'ఉత్తమ విలన్‌' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమయి శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్‌ అరవింద్‌. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్‌ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్‌లో కమల్‌ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్‌ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్‌' చిత్రీకరణ పూర్త్తెన వెంటనే ఆగస్టులో 'దృశ్యం' రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

English summary
Kamal clarified that he hasn't inked any deal with any filmmaker from Telugu. However, Kamal said he is in talks with a few directors in Telugu but said nothing has been finalized yet. Kamal said his next film will be produced under his home banner Rajkamal International.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu