»   » ఎవరికీ డీప్ కిస్ ?: కమల్ కొత్త చిత్రం 'చీకటి రాజ్యం' (ఫస్ట్ లుక్ పోస్టర్స్)

ఎవరికీ డీప్ కిస్ ?: కమల్ కొత్త చిత్రం 'చీకటి రాజ్యం' (ఫస్ట్ లుక్ పోస్టర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో ఆకలిరాజ్యం అంటూ వచ్చిన కమల్ హాసన్ ఇప్పుడు చీకటి రాజ్యం అంటూ మరోసారి తెలుగువారిని పలకలిస్తున్నాడు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు విడుదలైయ్యాయి. ఈ పోస్టర్స్ లో ఓ అమ్మాయిని కమల్ గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం తెలియలేదు. మనీషా నా లేక త్రిష అనా సస్పెన్స్ లో ఉంచారు.

హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో 'తూంగా వనం' టైటిట్ ఖరారు చేశారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది.

ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. జీబ్రాన్ సంగీతం అందించనున్నాడు. కమల్ హాసన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించడం ఇది నాలుగోసారి.

స్లైడ్ షోలో... ఫస్ట్ లుక్ పోస్టర్స్

ఇదో థ్రిల్లర్

ఇదో థ్రిల్లర్

ఉత్తమ విలన్ చిత్రం తర్వాత ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలుగులో స్ట్రయిట్ చేస్తున్న చిత్రం తూంగా వనం(నిద్రపోని అడవి). ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది.

సొంత బ్యానర్ పై ..

సొంత బ్యానర్ పై ..

కమల్ శిష్యుడు రాజేశ్ యం. సెల్వ దర్శకత్వంలో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చెన్నైలోనే..

చెన్నైలోనే..

తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం బుధవారం చెన్నైలో ఫొటో షూట్ కూడా పూర్తి చేసినట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో

ఈ సినిమాలో

ఈ చిత్రంలో త్రిష, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించనుంది.

పోలీస్ అధికారిగా...

పోలీస్ అధికారిగా...

ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు ఆఫిసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మూడే నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

English summary
Actor-filmmaker Kamal Haasan Tamil thriller "Thoongaavanam", which goes on floors on Sunday here, is titled "Cheekati Rajyam" in Telugu. The film will be simultaneously shot in Telugu and Tamil.
Please Wait while comments are loading...