Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్: కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘ఉత్తమవిలన్'. తెయ్యమ్ కళాకారుడిగా, సినిమా నటుడిగా కమల్‌హాసన్ రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ సంస్థ పై లింగుస్వామి నిర్మిస్తున్నారు. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో ఆడియో విడుదల కానుంది. ఇటీవల కన్నుమూసిన కమల్ హాసన్ గురువు, ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఈ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ ఈ విషయాలను తెలియజేసారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో కమల్ హాసన్ పోషిస్తున్న మనోరంజన్ పాత్రకు భార్యగా ఊర్వశి నటిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.విశ్వనాథ్ మనోరంజన్ మామ పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఆండ్రియా మనోరంజన్ ప్రియురాలి పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో మనోరంజన్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.
8వ శతాబ్దం బ్యాక్ డ్రాపులో నడిచే కథలో... నాజర్, ముత్తరాజన్, జయరాం, పార్వతి మెల్టన్, ఎంఎస్ భాస్కర్ కనిపించనున్నారు. మొత్తానికి ఈచిత్రం కమల్ హాసన్ నుండి వస్తున్న మరొక వైవిద్యమైన చిత్రం. ఉత్తమ విలన్ చిత్రానికి కన్నడ యాక్టర్, డైరెక్టర్ రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎం ఘిబ్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ హాసన్‌తో కలిసి సహజీవనం చేస్తున్న గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తోంది.