»   » ప్రియుడితో జోరుగా శ్రుతిహాసన్.. కమల్ సీరియస్!

ప్రియుడితో జోరుగా శ్రుతిహాసన్.. కమల్ సీరియస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ అందాల తార శ్రుతిహాసన్‌ లేటెస్ట్ అఫైర్‌పై తండ్రి కమల్ హాసన్ సీరియస్‌గా ఉన్నారట. బ్రిటన్ నటుడు మైఖేల్ కోర్సేల్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగించడం కమల్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. దాంతో వీరిద్దరిపై కమల్ గుర్రుగా ఉన్నారట.

 లండన్‌లో చిగురించిన ప్రేమ

లండన్‌లో చిగురించిన ప్రేమ

ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా శ్రుతి, మైఖేల్ మధ్య ప్రేమ చిగురించిందట. వీరిద్దరూ లండన్‌లో కలుసుకున్నారట. గత మూడు నెలలుగా ప్రేమ వ్యవహారం జోరుగా సాగుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల కథనం.

 రిషికేష్‌లో వెకేషన్ ట్రిప్

రిషికేష్‌లో వెకేషన్ ట్రిప్

ఇటీవల శ్రుతి, మైఖేల్ కలిసి లండన్‌ నుంచి చెన్నై వచ్చారని, అక్కడి నుంచి రుషికేష్ వెళ్లి కొద్దిరోజులు అక్కడ గడిపారు. రిషికేష్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా వచ్చి హుషారుగా కాటమరాయుడు షూటింగ్‌లో పాలుపంచుకొన్నారు.

ముంబైలో చెట్టాపట్టాల్

ముంబైలో చెట్టాపట్టాల్

ముంబైలో మైఖేల్, శ్రుతిహాసన్ ముంబైలో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడం బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. వారి బంధంపై అప్పట్లో అనేక కథనాలు వచ్చిన పెదవి విప్పలేదు. చివరికి తీవ్రస్థాయికి చేరుకోవడంతో మైఖేల్‌తో ప్రేమలో ఉన్నట్టు మనసులో మాట బయటపెట్టింది.

నేను వాటిని పట్టించుకొను

నేను వాటిని పట్టించుకొను

మీడియాలో వచ్చే ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని అందరికి చెప్పాల్సిన పనిలేదు. వాటిని నేను అంతగా పట్టించుకోను అని శ్రుతిహాసన్ స్పష్టం చేసింది.

 కమల్ ఆందోళన.. కంగారు

కమల్ ఆందోళన.. కంగారు

కూతురు ప్రేమ అఫైర్‌పూ రోజుకో రూమర్ పుట్టుకు రావడంపై కమల్ ఆందోళన చెందుతున్నారట. అది తమ కుటుంబ పరువు, ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విషయంపై కమల్‌ కంగారు పడుతున్నారట.

 కాటమరాయుడుతో బిజీ బిజీ

కాటమరాయుడుతో బిజీ బిజీ

ప్రస్తుతం కాటమరాయుడు చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హిందీలో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తున్న హీందీ చిత్రం బెహెన్ హోగీ తేరిలో నటిస్తున్నది.

బాయ్‌ఫ్రెండ్‌తో అడుగులో అడుగేస్తూ..

బాయ్‌ఫ్రెండ్‌తో అడుగులో అడుగేస్తూ..

కలిసి నడిచినా ఒంటిరిగా ఉన్నా ప్రతీ అడుగును లెక్కించాల్సిందే అని ఫోస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఒకే రంగు స్లిప్లర్లు వేసుకొని తిరగడం మీడియాను ఆకర్షించింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చేతిలో చేయి వేసుకొని నడుస్తున్న చిత్రాలను బాలీవుడ్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

సిద్ధార్థ్‌తో.. విద్యుత్ జామ్వాల్‌తో..

సిద్ధార్థ్‌తో.. విద్యుత్ జామ్వాల్‌తో..

గతంలో హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నట్టు రుమార్లు విస్తృతంగా ప్రచారమయ్యాయి. వారిద్దరూ పెళ్లి చేసుకొంటారనేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత హిందీ నటుడు విద్యుత్ జామ్వాల్‌తో అఫైర్ ఉన్నట్టు ప్రచారమైంది. తాజాగా మూడో అఫైర్ మైఖేల్ కోర్సెల్‌తో కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

English summary
Shruti Haasan’s love life has been in the spotlight of late. We told you how she is dating British actor Michael Corsale. In this situation father Kamal Haasan serious over Shruti Haasan's affair.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X