»   » జల్లికట్టుపై కాదు, దమ్ముంటే బుల్ రైడ్ ఆపండి: పెటాపై కమల్ హాసన్

జల్లికట్టుపై కాదు, దమ్ముంటే బుల్ రైడ్ ఆపండి: పెటాపై కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: జల్లికట్టు ఇష్యూపై తమిళనాడులో ప్రజలు చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. సినీ, రాజకీయ రంగాలతో పాటు ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయ క్రీడను కొనసాగించాలని కోరుకుంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే 'పెటా' లాంటి జంతు హక్కుల సంస్థలు ఈ క్రీడను కొనసాగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటంతో ..... పలువురు తారలు పెటా సంస్థ తీరును తప్పుబడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ పెటా తీరుపై మండి పడ్డారు.

Kamal Haasan

తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టును అణచివేసే హక్కు పెటాకు లేదని కమల్ హాసన్ అన్నారు. దమ్ముంటే డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్ ను నిషేధించేందుకు పెటా ప్రయత్నించాలంటూ కమల్ హాసన్ ట్వీట్ చేసారు.

ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వశా ఖకు, న్యాయమంత్రిత్వశాఖకు పంపించిన ఆర్డినెన్స్ ము సాయిదాకు న్యాయ మంత్రిత్వశాఖ , పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపాయి. దీనిని రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నారు.

English summary
In a tweet, Kamal Haasan said, "PETA go ban bull riding rodeos in Mr. Trump's U.S. You're not qualified to tackle our bulls. Empires have been made to quit India."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu